Hanuman Jayanti : నేడు హైదరాబాద్ లో హనుమాన్ జయంతి శోభాయాత్ర.. భారీగా ట్రాఫిక్ మళ్లింపు..

హైదరాబాద్ లో ఏప్రిల్ 23 మంగళవారం నేడు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా సిటీలో కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ డైవెర్షన్ లు ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ లో ఏప్రిల్ 23 మంగళవారం నేడు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా సిటీలో కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ డైవెర్షన్ లు ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర జరుగుతుండటంతో ఆ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సీపీ ప్రకటించారు. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామమందిరం నుంచి తాడ్ బండ్ హనుమాన్ మందిర్ వరకు విజయ యాత్ర జరుగుతుందని సీపీ తెలిపారు. ఆ యాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఉండడంతో ప్రజలు సమయం వృథా కాకుండా ఉండేందుకు ప్రత్యన్మ మార్గాలను సూచింటినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.

హనుమాన్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని రూట్ మ్యాప్ కూడా విడుదల చేశారు.

ఇవాళ ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమాన్ శోభయాత్ర.. గౌలిగూడ రామమందిరం నుండి ప్రారంభమై సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ హనుమాన్ మందిర్ వరకు సాగుతుంది. దీంతో కూడళ్లలో 44 డైవర్షన్ పాయింట్లు ఉన్నాయి. హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశించారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి.

హనుమాన్ శోభయాత్ర సాగే ప్రాంతాలు..

గౌలిగూడ రామమందిరం నుంచి హనుమాన్ జయంతి విజయ యాత్ర ప్రారంభమై.. శంకర్ షేర్ హోటర్, గౌలిగూడ చమాన్, రంగ్ మహల్ జంక్షన్, జీపీవో, యూసుఫియాన్ కంపెనీ, డీఎం అండ్ హెచ్ఎస్, చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్స్, కాచిగూడ ఎక్స్ రోడ్స్, బొగ్గుల కుంట ఎక్స్ రోడ్స్, ఈడెన్ గార్డెన్, లింగంపల్లి ఎక్స్ రోడ్స్, వైఎంసీఎ- నారాయణగూడ, షాలిమర్, వాటర్ ట్యాంక్ నారాయణగూడ, బర్కత్ పుర పోస్టాఫీస్, నారాయణగూడ ఫ్లై ఓవర్, క్రౌన్ ఓవర్ ఫ్లై ఓవర్, మెట్రో కేఫ్, వీఎస్టీ ఎక్స్ రోడ్, ఇందిరాపార్క్, గాంధీ నగర్ టి జంక్షన్, స్ట్రీట్ నెంబర్ 9 హెచ్- నగర్, గాంధీ నగర్ టి జంక్షన్, కవాడీగూడ, డీబీఆర్ మిల్, బైబిల్ మిల్, సైలింగ్ క్లబ్, బైబిల్ హౌజ్, కార్బాలా మైదాన్, కవాడీ గూడ, ప్యాట్నీ, రాణిగంజ్, సీటీవో, సీటీవో ఫ్లైఓవర్ రెండు వైపులా, బలమరాయ్, సేఫ్ ఎక్స్ ప్రెస్, బోయిన్ పల్లి ఎక్స్ రోడ్స్, తివోలీ, డైమండ్ పాయింట్, బోయిన్ పల్లి మార్కెట్, మస్తాన్ హోటల్ ఏరియాల మీదుగా హనుమాన్ యాత్ర సాగుతుందని తెలిపారు.