Hotel Shadab: జాగ్రత్త.. షాదాబ్‌ బిర్యానీ లొట్టలేసుకు తింటున్నారా.. మీ పని మటాష్‌..

ఓ నెటిజన్‌ చేసిన పోస్ట్.. ఇప్పుడు షాదాబ్ బిర్యానీ అంటేనే భయం పుట్టిస్తోంది. షాదాబ్ చికెన్‌లో హానికారిక రంగులు కలుపుతున్నారని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన విజయ్‌ గోపాల్ అనే వ్యక్తి.. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిని ట్యాగ్‌ చేశారు.

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 04:58 PM IST

Hotel Shadab: షాదాబ్ బిర్యానీ.. అది జస్ట్ ఫుడ్ మాత్రమే కాదు.. హైదరాబాద్‌ ఎమోషన్ అంటుంటారు చాలామంది. హైదరాబాద్‌ విజిట్‌కు వచ్చిన వాళ్లు ఎవరైనా సరే.. చార్మినార్‌ చూసి షాదాబ్ బిర్యానీ తిని వెళ్తుంటారు. పాతబస్తీకి అది ఓ ల్యాండ్ మార్క్ అయింది ఒకరకంగా! టేస్ట్ కూడా ఓ రేంజ్‌ అంటూ షాదాబ్ బిర్యానీని లొట్టలేసుకు తింటుంటారు చాలామంది. ఐతే ఓ నెటిజన్‌ చేసిన పోస్ట్.. ఇప్పుడు షాదాబ్ బిర్యానీ అంటేనే భయం పుట్టిస్తోంది.

Samantha Ruth Prabhu: సైకిల్‌ గుర్తుకు ఓటేయాలంటున్న సమంత.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో..

షాదాబ్ చికెన్‌లో హానికారిక రంగులు కలుపుతున్నారని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన విజయ్‌ గోపాల్ అనే వ్యక్తి.. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిని ట్యాగ్‌ చేశారు. హైకోర్టు రోడ్డులోని షాదాబ్‌ రెస్టారెంట్‌లో తాను చికెన్‌ తిన్నానని.. ఐతే భోజనం చేసిన తర్వాత ఐదు గంటల వరకు చేతులకు అంటుకున్న రంగు పోలేదని రాసుకొచ్చాడు. హోళీ ఆడినప్పుడు చేతులకు ఎలా రంగులు అంటుకుంటాయో.. ఆ చికెన్ తిన్న తర్వాత కూడా అలానే అనిపించిందని.. ఇది చాలా డేంజర్ అంటూ రాసుకొచ్చాడు. షాదాబ్ హోటల్‌పై చర్యలు తీసుకోవాలంటూ.. సీఎం రేవంత్‌తో పాటు, హైదరాబాద్‌ మేయర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ట్యాగ్‌ చేశాడు. చికెన్ ఐటమ్స్ కొన్నింటికి.. ఫుడ్ కలర్ యాడ్ చేసి.. హోటల్స్‌లో కుక్‌ చేస్తుంటారు.

ఇలాంటి ఫుడ్ కలర్స్‌ డేంజర్ అని డాక్టర్లు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఐతే విజయ్‌గోపాల్‌ ట్వీట్‌తో.. మళ్లీ ఇది చర్చకు వచ్చింది. విజయ్‌ గోపాల్ ట్వీట్‌తో భయం మొదలైంది. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. దీంతో షాదాబ్ బిర్యానీ, షాదాబ్ చికెన్ గురించే.. ఎక్కువ చర్చ వినిపిస్తోంది.