BRS KHALI : బీఆర్ఎస్ లో భారీ సంక్షోభం.. 25 మంది జంపింగ్ కు రెడీ

లోక్ సభ ఎన్నికల నాటికి BRS మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వదిలి పోతున్నారు. KCR ఫ్యామిలీని స్కాముల పాపాలు చుట్టుముడుతున్నాయి.

లోక్ సభ ఎన్నికల నాటికి BRS మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వదిలి పోతున్నారు. KCR ఫ్యామిలీని స్కాముల పాపాలు చుట్టుముడుతున్నాయి. కవిత అరెస్ట్ (Kavitha arrested), లీడర్ల జంప్స్ తో గులాబీ బాస్ కేసీఆర్ కి కంటి నిండా కునుకు కరువైంది. అన్నింటికంటే ముఖ్యంగా పాతిక మంది బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తారన్న టాక్ ఆ పార్టీలో భయం పుట్టిస్తోంది.

లేటెస్ట్ గా BRS నుంచి సీనియర్ నేతలు కేకే, కడియం శ్రీహరి … వాళ్ళ కూతుళ్ళతో కలసి హస్తం పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ (KCR) కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కాళేశ్వరం స్కామ్ (Kaleshwaram Scam), విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసు, ధరణి భూ మాఫియా… ఇలా ఒక్కోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. లేటెస్ట్ గా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తో గులాబీ పార్టీ ప్రతిష్ట పాతాళానికి చేరింది. లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు లోక్ సభ ఎన్నికల్లో BRSపై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. ఇంత జరుగుతున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడంతో… BRS ప్రభుత్వంలో అక్రమాలు జరిగినట్టు జనం నిర్ధారణకు వచ్చేశారు.

ఇక కేటీఆర్ కామెంట్స్ వీటికి ఆద్యం పోస్తున్నాయి. లంగా గాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే తప్పేంటి అని కామెంట్ చేయడం ఆ పార్టీకి తీవ్ర డ్యామేజీ కలిగించింది. సీనియర్లంతా కాంగ్రెస్ లో జాయిన్ అవుతుండటంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా హస్తం గూటికి చేరిపోవాలని డిసైడ్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే పాతిక మంది MLAలు నుంచి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించకుండా 2/3 వంతు BRSఎమ్మెల్యేలు వెళ్ళిపోయే ఛాన్సుంది. కారు పార్టీకి ఉన్న 39 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 23మంది కాంగ్రెస్ లో చేరితే BRS ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అయినట్టే.

ఎన్నికలకు ముందే పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు మారకపోతే లోక్ సభ ఎన్నికల తర్వాత సమీకరణాలు ఎటైనా మారొచ్చు… అందుకే కాంగ్రెస్ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చేర్చుకోవాలని డిసైడ్ అయింది. గతంలో అవసరం లేకున్నా… కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను తెచ్చుకున్నారు కేసీఆర్. ఆ రెండు పార్టీల ఉనికి తెలంగాణలో లేకుండా చేయాలని భావించారు. సేమ్ స్టోరీని సీఎం రేవంత్ రెడ్డి రిపీట్ చేస్తున్నారు. దాంతో లోక్ సభ ఎన్నికల కంటే ముందే కారు పార్టీ షెడ్డుకు పోయే అవకాశాలు కనిపిపస్తున్నాయి.