CM Revanth Medigadda Tour : నువ్వొస్తానంటే హెలికాప్టర్ పెడతా… కేసీఆర్ కు రేవంత్ ఆఫర్ !

కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బయల్దేరారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసి మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు.

 

కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బయల్దేరారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసి మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు. ఈ టూర్ కు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు వెళ్ళడం లేదు. MIM, CPI కి చెందిన ఎమ్మెల్యేలు బయల్దేరారు.

మేడిగడ్డకు వెళ్ళే ముందు తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) కొద్దిసేపు చర్చ నడిచింది. మేడిగడ్డకు అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించాం.. అక్కడి వాస్తవాలు చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము బస్సుల్లో బయల్దేరుతున్నామనీ… మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ (Helicopter) సిద్ధం చేస్తామన్నారు.. ప్రాజెక్ట్ రీడిజైన్ అనే బ్రహ్మపదార్థాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారు.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించి నిజాలను ప్రజలకు చెప్పాలనే ఈ ప్రాజెక్ట్ పర్యటనకు వెళ్తున్నట్టు చెప్పారు.

ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది.. ఇసుక కదిలేలా పేకమేడలు కట్టారా అంటూ సీఎం అసెంబ్లీలో ప్రశ్నించారు. కుంగిన ప్రాజెక్టును చూపించకుండా గత ప్రభుత్వం దాచి పెట్టింది.. ఎవరూ వెళ్లకుండా భారీగా పోలీసులను పెట్టి అడ్డుకున్నారు.. కొందరు అధికారులు ఆఫీసుల్లో డాక్యుమెంట్లను మాయం చేశారు అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఓ విజ్ఞప్తి చేశారు రేవంత్. మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి.. మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించాలని కోరారు. మీ అనుభవాలను తెలుసుకోడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

తాజ్ మహల్ (Taj Mahal) లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ వివరించి చెప్పాలని కేసీఆర్ ను కోరారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలనీ… తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏంటి? అని ప్రశ్నించారు. కాళేశ్వర్ రావు (Kaleshwar Rao) అని గతంలో ఆయన్ను అప్పటి గవర్నర్ సంభోదించారు.. కాళేశ్వర్ రావుని మేడిగడ్డకు రావాలని కోరారు సీఎం. రేపో ఎల్లుండో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి శ్వేతపత్రం విడుదల చేస్తారని అన్నారు. కాళేశ్వరం కథేంటో సభలో తేలుద్దామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉంది.. అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.