ఈ మధ్య కాలంలో ఓయో యాప్ వాడకం ఎక్కువైంది. గత పదేళ్ళ నుంచి ఈ యాప్ ని యువత బాగా వాడుతున్నారు. హోటల్ లో రూమ్స్ తీసుకోవడానికి ఈ యాప్ మంచి ఆఫర్లు, తక్కువ ధరలకే రూమ్స్ ఇవ్వడంతో యూత్ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమలో ఉన్న వాళ్ళు లేదా శారీరకంగా కలవాలి అనుకున్న వాళ్లకు ఓయో యాప్ మంచి ఆప్షన్. అయితే ఈ యాప్ ద్వారా తీసుకున్న రూమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలనే సలహాలు కూడా మనం వింటూనే ఉంటాం. శారీరకంగా కలిసే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి.
అలాగే మహిళలతో వెళ్ళే కుటుంబాలు కూడా జాగ్రత్తగా లేకపోతే మాత్రం సమస్యలు వస్తాయని హెచ్చరిస్తూ ఉంటారు. కెమెరాలు రహస్యంగా పెట్టి వీడియోలు రికార్డ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి గతంలో ఎన్నో ఉదంతాలు బయటకు రావడం మనం చూసాం. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరా ఏర్పాటు చేసిన హోటల్ నిర్వాహకుడు… వీడియోలు షూట్ చేస్తున్నాడని గుర్తించారు.
రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాటి ద్వారా బాధితులను బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ జంటను ఇలాగే హోటల్ యజమాని బెదిరించడంతో సదరు హోటల్ పై పోలీసులు రైడ్ చేసారు. ఆ రైడ్ లో రహస్యంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు బయటపడ్డాయి. నిందితుని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు వద్ద నుండి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని ఆర్జి ఐ ఏ ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా అతని ల్యాప్ టాప్ కూడా స్వాధీనం చేసుకుని అందులో పలు వీడియోలను గుర్తించినట్టు తెలుస్తోంది. గతంలో వీరినే కాకుండా ఇంకా ఎవరిని అయినా బెదిరించడా, వీడియోలను ఎవరికి అయినా విక్రయిస్తున్నాడా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.