Intermediate Exams : నేటి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. నేటి నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. నేటి నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది హాజరు కానున్నారు. అందులో ఫస్టియర్ విద్యార్థులు 4,78,718 మంది ఉండగా, సెకండియర్ విద్యార్థులు 5,02,260 మంది ఉన్నారు. సెకండియర్ ఏడాది ప్రైవేటుగా పరీక్షలు రాసేవారు 58,071 మంది ఉన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్లోకి అనుమతించబోమని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా (Shruti Ojha) స్పష్టం చేశారు.

పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పేపర్ లీకేజీ (Paper Leakage) కి ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మంత్ర పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆర్టీసీ (TSRTC) ఉద్యోగలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు ఎక్కడ కనిపించిన.. వారు చెయ్యెత్తిన చోట బస్సు ఆపి వారికి సహకరించాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి సరైన సమయానికి చేరుకోలేకపోతే వారు పరీక్షను రాసే అవకాశం కోల్పోతారని పేర్కొన్నారు. అందుకే వారికి బస్సు ఆపి సహకరించాలని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్..

  • ఫిబ్రవరి 28 – పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజి పేపర్‌-1)
  • మార్చి 4 – పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్-1ఏ, బోటనీ పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1)
  • మార్చి 6 – మేథమేటిక్స్‌ పేపర్‌ 1బి, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1
  • మార్చి 11- ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1
  • మార్చి 13 – కెమెస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1
  • మార్చి 15 – పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-1 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్‌)
  • మార్చి 18 – మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జియోగ్రఫీ పేపర్‌-1

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్ష తేదీల :

  • ఫిబ్రవరి 29 – పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2)
  • మార్చి 2 – పార్ట్‌ 1 (ఇంగ్లీష్‌ పేపర్‌-2)
  • మార్చి 5 – పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్‌ 2ఏ, బోటనీ పేపర్‌ 2, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ 2)
  • మార్చి 7 – మేథమేటిక్స్‌ పేపర్‌ 2బి, జూవాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్-2
  • మార్చి 12 – ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2
  • మార్చి 14 – కెమెస్ట్రీ పేపర్‌ -2, కామర్స్‌ పేపర్‌-2
  • మార్చి 16 – పబ్లిక్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-2 (ఫర్‌ బైపీసీ స్టూడెంట్స్‌)
  • మార్చి 19 – మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2