తెలంగాణలో ఎన్నికల సమరం పీక్స్‌కు చేరింది. ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండడంతో… పార్టీలన్నీ స్పీడ్ పెంచాయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఇప్పుడు ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. తెలంగాణ ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది. ఐతే రాష్ట్రవ్యాప్తంగా అందరి అటెన్షన్ డ్రా చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం.. హైదరాబాద్! ఒవైసీ మీద మాధవీలతను బరిలోకి దింపింది బీజేపీ. ఎంఐఎంతో టగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా.. మాధవీలత ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఆమె జనాలను కలుసుకుంటున్న తీరు.. ఒవైసీపీ టార్గెట్ చేస్తున్న విధానం.. ప్రతీది కొత్తగా ఉంది. ఎప్పటి నుంచి హైదరాబాద్ పార్లమెంట్‌లో గ్రౌండ్‌వర్క్ మొదలుపెట్టిన మాధవీలత.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఐతే హైదరాబాద్ అంటే.. అది ఎంఐఎం సీటు అని కన్ఫార్మ అని.. అంతా డిసైడ్ అయిపోతారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే.. 16 స్థానాలు టార్గెట్‌గానే పార్టీల వ్యూహాలు ఉంటాయ్. ఆ లెవల్‌లో ఎంఐఎం.. హైదరాబాద్‌లో పాతుకుపోయింది. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవడం.. విజయం సాధించడం.. ప్రతీసారి ఒవైసీ చేసేది ఇదే ! అలాంటి ఒవైసీపీ ఇప్పుడు ప్రచారం రూట్ మార్చారు. తన కోసం, పార్టీకోసం ప్రత్యేకంగా పాట రాయించుకున్నారు. నల్గొండ గద్దర్ గళంలో ఆ పాట అద్భుతం అనిపిస్తోంది.
ఇదే ఇప్పుడు మాధవీలతకు ఆయుధంగా మారిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఒవైసీకి భయం స్టార్ట్ అయిందని.. అందుకే పాటలు తయారు చేయించుకోవడంలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని మాధవీలత గట్టిగా గొంతు వినిపిస్తున్నారు. ఇన్నాళ్లు హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఒవైసీ ఆడింది ఆటగా మారిందని.. జనాలు మార్పు కోరుకుంటున్నారని తెలిసే.. ఇలా పాట రూపంలో మాయ చేసేందుకు ఒవైసీ రెడీ అవుతున్నారంటూ.. మాధవీలత ఘాటుగా గళం వినిపిస్తున్నారు. నిజానికి ఎంఐఎం పార్టీకి ప్రత్యేకంగా పాట అంటూ ఏదీ లేదు. అదీ తెలుగులో అసలే లేదు. అలాంటిది ఇప్పుడు తెలుగులో పాట రాయించుకొని మరీ రిలీజ్ చేసి.. దాన్ని ప్రచారంగా వాడుకోవడంపై.. జనాల్లోనూ కొత్త చర్చ జరుగుతోంది.