Jay Jayah Telangana : జయ జయహే తెలంగాణ.. ఎందుకు రాష్ట్ర గేయం కాలేదంటే…

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ ... జయ జయహే తెలంగాణ (Jay Jayah Telangana)... జననీ జయకేతనం (Janani Jayaketan) ... ముక్కోటి గొంతుకలు ఒక్కటైన జనచేతనం... ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Andeshri) రాసిన ఈ గేయం యావత్ తెలంగాణ ఉద్యమకారులను ఒక్కటి చేసింది.

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ … జయ జయహే తెలంగాణ (Jay Jayah Telangana)… జననీ జయకేతనం (Janani Jayaketan) … ముక్కోటి గొంతుకలు ఒక్కటైన జనచేతనం… ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Andeshri) రాసిన ఈ గేయం యావత్ తెలంగాణ ఉద్యమకారులను ఒక్కటి చేసింది. ఆ టైమ్ లో తెలంగాణ ప్రాంతంలోని స్కూళ్ళు, కాలేజీలు, గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ ఈ పాటను పాడేవారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ కూడా ఈ పాట పాడేవారు. అందరూ పాడుకోడానికి వీలుగా కొన్ని మార్పులను కూడా ఆయన సూచించారు. అందెశ్రీ రాసిన మొత్తం గేయంలో నాలుగు చరణాలను మాత్రం తీసుకొని కొంచెం మార్చారు.

తెలంగాణ రాష్ట్రం (Telangana State) వచ్చాక ఈ గేయమే రాష్ట్ర గీతం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దాన్నేకాదు… అసలు రాష్ట్ర గీతం అంటూ లేకుండానే 10యేళ్ళ పాటు పాలన సాగించారు. 2021లో అసెంబ్లీలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అడిగిన ప్రశ్నకు… అసలు రాష్ట్ర గేయం ఏదీ లేదని కేసీఆరే సమాధానం ఇచ్చారు. ఆ టైమ్ లోనే రేవంత్ రెడ్డి స్పందించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఓ అధికారిక గేయం లేకపోవడమేంటని ప్రశ్చించారు. తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వం న్యాయం చేయలేదు. వాళ్ళ లెక్క కూడా సర్కార్ దగ్గర లేదు. ఇప్పుడు కనీసం అధికారిక గేయం కూడా లేదా అని రేవంత్ ప్రశ్నించారు. కానీ ఏనాడూ బీఆర్ఎస్ పెద్దలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.

తెలంగాణ ఉద్యమ సమయంలో బహిరంగ సభల్లో కవి అందెశ్రీని తెగపొగిడిన కేసీఆర్ (KCR) …సీఎం అయ్యాక అస్సలు పట్టించుకోలేదు. కోదండరామ్ లాంటి ఒక్కో ఉద్యమ నేతను కేసీఆర్ కి వదులుకున్నట్టే అందెశ్రీ కూడా దూరమయ్యారు. తెలంగాణ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా అందెశ్రీని ప్రకటిస్తారని అనుకున్నా చేయలేదు. తనకు భజన చేస్తూ తమ పార్టీకి మద్దతు ఇచ్చిన వారికే ప్రభుత్వ పదవులు అప్పగించిన కేసీఆర్… మిగతా వాళ్ళని పట్టించుకోలేదన్నవిమర్శలు కూడా ఉన్నాయి.

తెలంగాణ ఏర్పడ్డ పదేళ్ళ తర్వాత జయ జయహే తెలంగాణను రాష్ట్ర గేయంతా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు… తెలంగాణ తల్లి విగ్రహం తయారీపైనా అప్పట్లో విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ కు చెందిన ఓ మహిళా నాయకురాలి ముఖం ఆధారంగా ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దారని కామెంట్స్ వచ్చాయి. దాంతో ఇప్పుడా విగ్రహం రూపు రేఖలు కూడా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందు రేవంత్ రెడ్డిని అందెశ్రీ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలోనే తెలంగాణ సంస్కృతి మీద ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. కళాకారులంటే కేసీఆర్ కి గౌరవం లేదనీ… వ్యక్తిగత ప్రతిష్టకు పోయి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులను పక్కన పెట్టేశారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జయ జయహే తెలంగాణను అధికార గీతం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను మరోసారి గుర్తు చేశారు రేవంత్. ఇప్పటిదాకా తెలంగాణ సెంటిమెంట్ నే నమ్ముకొని రాజకీయం చేస్తున్న BRSకు గట్టి ఝలక్ ఇచ్చారు. రాష్ట్రం గురించి కొట్లాడేది మేమే… లోక్ సభ ఎన్నికల్లో తమనే గెలిపించాలని ప్రచారం చేసుకుంటున్న BRSకి రాష్ట్ర గీతం ప్రకటన ఇబ్బందిగా మారనుంది. ఇప్పటికీ ఆ గీతాన్ని ఎందుకు అధికారికంగా ప్రకటించలేదో చెప్పుకోలేని ఇరకాటంలో పడ్డారు గులాబీ బాస్. అధికారకి గేయంపై ఉత్తర్వులు వెలువడగానే… రాష్ట్రంలోని విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ దీన్ని ఆలపించనున్నారు.