లిక్కర్ కేసులో మాజీ ఎంపీ కవితకు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గంటన్నర నుంచి సుప్రీం కోర్టులో వాడీ వేడి వాదనలు జరగగా ఈడీపై సుప్రీం కోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయవాది తీర్పు వెల్లడించారు. తీర్పు లో అసంబద్ధ వ్యాఖ్యలు చేసినందుకు ఢిల్లీ హైకోర్టును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం కోర్టు కేసు మెరిట్స్ లోకి వెళ్ళడం లేదని పేర్కొంది. కవిత లాయర్ ముకుల్ రోహత్గీ బలమైన వాదనలు వినిపించారు. ఈడి చెప్తున్న అప్రూవర్ సాక్ష్యాలను కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ లోనూ చెప్పారు… కానీ, కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిందన్నారు. ఇది బెయిల్ పిటిషన్ విచారణ… పూర్తిస్థాయి విచారణ? అని ఈడిని ప్రశ్నించారు.