KAVITHA YEDUPU : చిల్లర వేషాలు మానని కవిత.. ఇప్పటికీ ఆంధ్ర వాళ్లే టార్గెట్

తెలంగాణలో రాజకీయం (Telangana Politics) చేయాలంటే ఆంధ్ర వాళ్ళని తిట్టాలి. TRS పుట్టినప్పటి నుంచి ఇదే ఫార్ములాపై మనుగడ సాగిస్తోంది. ఎప్పుడు పార్టీకి జనంలో ఆదరణ తగ్గుతుంది అనిపించినప్పుడల్లా ఆంధ్ర వాళ్ళని తిట్టడం, వాళ్లని కించపరచడం, మిగిలిన వాళ్ళని రెచ్చగొట్టడం... కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ అలవాటైన విద్య. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయిపోయింది. TRS బీఆర్ఎస్ (BRS) గా మారిపోయింది.

తెలంగాణలో రాజకీయం (Telangana Politics) చేయాలంటే ఆంధ్ర వాళ్ళని తిట్టాలి. TRS పుట్టినప్పటి నుంచి ఇదే ఫార్ములాపై మనుగడ సాగిస్తోంది. ఎప్పుడు పార్టీకి జనంలో ఆదరణ తగ్గుతుంది అనిపించినప్పుడల్లా ఆంధ్ర వాళ్ళని తిట్టడం, వాళ్లని కించపరచడం, మిగిలిన వాళ్ళని రెచ్చగొట్టడం… కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ అలవాటైన విద్య. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అయిపోయింది. TRS బీఆర్ఎస్ (BRS) గా మారిపోయింది. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దాదాపు 10 ఏళ్లు పాలించింది. మొత్తం పిండుకొని, నంజుకుని, నమిలి మింగేసింది. ఆ మోసపూరిత డైలాగులు విని… విని.. అలసిపోయిన జనం… ఇక చాలు అంటూ కేసీఆర్ ని ఇంటికి పంపించారు. అయినా వాళ్ళ బుద్ధి మారలేదు.

మళ్లీ తెలంగాణ జనంలో పలుకుబడి పెరగాలంటే పాత ఫార్ములానే ప్రయోగించాలని కేసీఆర్ కుటుంబం నిర్ణయించినట్లు ఉంది. మండలి సాక్షిగా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత… TSPSCపై చర్చిస్తూ… అందులో ఇద్దరు ఆంధ్ర వాళ్ళు ఉన్నారని ఆక్షేపించారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమెను ఎత్తిపొడుస్తూ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. తెలంగాణ మొత్తం మిమ్మల్ని ఓడించిన హైదరాబాదులో ఆంధ్రా వాళ్లే మీకు 17 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఆ విషయం మర్చిపోవద్దు. అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని రక్షించిందే ఆంధ్ర వాళ్ళు. అసలు కాళేశ్వరం (Kaleswaram) కట్టిన కాంట్రాక్టర్ ఎవరు? మేఘా సంస్థ ఎండీ పివి కృష్ణారెడ్డి ఆంధ్రవాడు కాదా? ఆయన ఇచ్చిన 8 శాతం కమీషన్లతోనే వేల కోట్లు సంపాదించలేదా అని నిలదీస్తున్నారు.

నీకు లిక్కర్ బిజినెస్ (Liquor Business) లో భాగస్వామి ఎవరు ? అరబిందో సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఆంధ్రవాడు కాదా? వైసీపీ (YCP) నేత విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy) కి అతను బంధువు కాదా ? అంతవరకు ఎందుకు కేటీ రామారావుకి వ్యాపార భాగస్వాములు, స్నేహితులు అయిన రామలింగరాజు కొడుకులు, ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్లు, గ్రీన్ కో సంస్థ అధినేత అనిల్ గోపి వీళ్లంతా ఆంధ్రవాళ్ళు కాదా? మీ అవసరాలకు… మీ అవినీతికి ఆంధ్రవాళ్ళు భాగస్వాములు అయినప్పుడు… మిగిలిన వాటిల్లో మాత్రం ఎందుకు భాగస్వాములు కాకూడదు.? ఆంధ్రప్రదేశ్ లో మీరు వెళ్లి BRS పార్టీ పెట్టొచ్చు… రాజకీయాలు చేయొచ్చు…. కానీ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు రాకూడదా? తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ (TTD) బోర్డులో తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు. TSPSCలో మాత్రం ఆంధ్ర వాళ్ళు ఎవరూ ఉండకూడదా? ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం వల్లే జనం మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంకా బుద్ధి రాకపోతే శాశ్వతంగానే ఇంట్లో ఉండిపోతారు. అక్రమంగా కూడబెట్టిన డబ్బుతో ఎంజాయ్ చేస్తూ అలా మిగిలిపోతారు. అంటూ సిటిజెన్స్ రకరకాలుగా కవిత స్టేట్మెంట్ పై రియాక్ట్ అయ్యారు.