MLC Kavitha : నేటితో ముగిసిన కవిత జ్యుడిషియల్ కస్డడీ.. మళ్లీ కస్టడీ పొడిగించిన ఈడీ..

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమర్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు.

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమర్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. మార్చి15వ తేదీన ఆమెను EDఅధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ CM కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడంతో తనకు కూడా బెయిల్ వస్తుందని కవిత భావిస్తున్నారు. అంతలో కవితకు మరో బిగ్ షాక్ తగిలింది.

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ అంశంలో సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జూలై 7వరకు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.