KCR family z : ఎంపీ ఎన్నికలకు కేసీఆర్‌ ఫ్యామిలీ దూరం.. కవిత స్థానంలో ఎవరు పోటీ చేస్తారంటే..

లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఆసక్తికరంగా మారుతున్నాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్‌ చేస్తుంటే... అధికార పార్టీగా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.

లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఆసక్తికరంగా మారుతున్నాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్‌ చేస్తుంటే… అధికార పార్టీగా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మెజారిటీ సీట్లు దక్కించుకొని తమ బలమేంటో ఢిల్లీకి చూపించాలని ఫిక్స్ అయింది. దీంతో పాలిటిక్స్‌ సెగలు కక్కుతున్నాయ్ ఇక్కడ. బీజేపీ(BJP), కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా.. ఈ ఎన్నికలను బీఆర్ఎస్‌ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు రిపీట్‌ కాకుండా.. సిట్టింగ్‌ల్లో చాలామందిని మార్చేందుకు గులాబీ పార్టీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి చేవెళ్ల, కరీంనగర్ బీఆర్ఎస్‌ అభ్యర్థుల విషయంలో మాత్రమే క్లారిటీ వచ్చింది.

కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీకి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి పరిణామాల మధ్య… ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ ఫ్యామిలీ సిద్ధం అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకూడదని ఫిక్స్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. మెదక్‌ నుంచి కేసీఆర్‌, నిజామాబాద్ నుంచి కవిత, మల్కాజ్‌గిరి నుంచి కేటీఆర్ పోటీ చేస్తారంటూ మొన్నటివరకు రకరకాల ఊహాగానాలు వినిపించాయ్. ఐతే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ చేయాలని గులాబీ బాస్‌ నిర్ణయించినట్లు తెలుస్సతోంది.

2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కవిత.. 2019ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. మరో మూడేళ్లకుపైగా పదవీ కాలం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కొత్త అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్‌. కవిత ఇకపై రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతారని తెలుస్తోంది. మరి ఇది నిజంగా నిజం అవుతుందా.. ప్రచారంగా మాత్రమే మిగిలిపోతుందా చూడాలి. ఏమైనా లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ ఫ్యామిలీ నిజంగా ఫిక్స్ అయితే.. తెలంగాణ రాజకీయం ఇంకోలా మారే అవకాశం ఉంటుందని నిపుణుల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం.