KUMARI AUNTY: కుమారి ఆంటీ హోటల్‌ మూయించింది వాళ్లేనా?

ఎప్పటి నుంచో అక్కడ బిజినెస్‌ చేస్తున్నా.. కొన్ని రోజులుగా కుమారి ఆంటీ బాగా ఫేమస్‌ అయ్యింది. రెండు లివర్లకు వెయ్యి రూపాయలు బిల్‌ అయ్యింది అనే రీల్‌ ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయ్యింది. ఆ రీల్‌ తరువాత ఆంటీ మీల్స్‌ పాయింట్‌కు రద్దీ ఇంకా పెరిగింది.

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 12:35 PM IST

KUMARI AUNTY: హైదరాబాద్‌లోని ఐటీసీ హోటల్‌ పక్క లేన్‌ గురించి చెప్పాలి అంటే ఒకప్పుడు ఐటీసీ హోటల్‌నో లేక ఇనార్బిట్‌ మాల్‌నో ల్యాండ్‌మార్క్‌గా చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం కుమారి ఆంటీ మీల్స్‌ పాయింట్‌ను ల్యాండ్‌మార్క్‌గా చెప్తున్నారు. ఎప్పటి నుంచో అక్కడ బిజినెస్‌ చేస్తున్నా.. కొన్ని రోజులుగా కుమారి ఆంటీ బాగా ఫేమస్‌ అయ్యింది. రెండు లివర్లకు వెయ్యి రూపాయలు బిల్‌ అయ్యింది అనే రీల్‌ ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయ్యింది. ఆ రీల్‌ తరువాత ఆంటీ మీల్స్‌ పాయింట్‌కు రద్దీ ఇంకా పెరిగింది.

CONGRESS: వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చేయండి.. పార్టీని వీడిన వాళ్లకు కాంగ్రెస్ ఆహ్వానం

వేరే ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి ఫుడ్‌ తినేందుకు వస్తున్నారు. హోటల్‌ కస్టమర్స్‌తో ఆ రోడ్డు మొత్తం బ్లాక్‌ అయ్యేది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కుమార్‌ ఆంటీ హోటల్‌ కారణంగానే అంత ట్రాఫిక్‌జామ్‌ అవుతోందంటూ హోటల్‌ మూయించారు. అయితే ఇదే విషయంలో ఇంటర్నెట్‌లో వేర్వేరు వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో ఫేమస్‌ అవ్వడంతో రీసెంట్‌గా కుమారి ఆంటిని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ వాళ్లు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో తన ఆస్తి గురించి చెప్పింది కుమారి. తనకు ఊర్లో జగనన్న ఇచ్చిన ఇల్లు తప్ప ఇంకా ఏం ఆస్తులు లేవని చెప్పింది. ఇక్కడ కూడా లోన్‌ తీసుకుని ఓ ఇల్లు కొనుక్కున్నామని.. ప్రస్తుతం హోటల్‌ నడుపుతూ ఆ లోన్‌ కట్టుకుంటున్నామని చెప్పింది. ఈ ఇంటర్వ్యూ బయటికి వచ్చిన కొన్ని రోజలుకే కుమారి ఆంటీ హోటల్‌ మూసేయాలంటూ పోలీసులు వచ్చారు. దీంతో జగన్‌ అంటే గిట్టనివాళ్లే ఈ పని చేయించారని ఇంటర్నెట్‌లో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో ఉంది జగన్‌ వ్యతిరేక ప్రభుత్వమే కాబట్టి వాళ్లే ఇలా చేయించారంటూ పోస్టులు కూడా పెడుతున్నారు.

ఇక కుమారి ఆంటీ హోటల్‌ పక్కనే చాలా ఫుడ్‌ హోటల్స్‌ ఉంటాయి. కానీ వచ్చే కస్టమర్లు అంతా కుమారి ఆంటీ హోటల్‌కే వెళ్తారు. దీంతో పక్కవాళ్ల బిజినెస్‌లు దెబ్బతింటున్నాయి. దీంతో వాళ్లే కావాలని పోలీసుల చేత ఇలా చేయించారు అనే మరో వాదన కూడా ఇంటర్నెట్‌లో జరుగుతోంది. ఈ వాదనల్లో ఎంత నిజం ఉంది అనే విషయం పక్కన పెడితే.. ఇంటర్నెట్‌లో వచ్చిన ఫేం కుమారి ఆంటీకి బిజినెస్‌ లేకుండా చేసింది. ఆంటీకి ఈ పరిస్థితి వచ్చేలా చేసింది ఎవరో ఆ దేవుడికే తెలియాలి.