KUMARI AUNTY: రెండు రోజుల నుంచి ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ పేరే పినిపిస్తోంది. ఇంటర్నెట్‌లో బాగా ఫేమస్ ఐన ఈ ఆంటీ హోటల్ ఒక్కసారిగా క్లోజ్ అయ్యింది. హోటల్‌కు కస్టమర్లు ఎక్కువగా రావడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందంటూ కుమారి ఫుడ్‌స్టాల్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. ఫుడ్ పెట్టేందుకు అనుమతి లేదంటూ మూయించారు. దీంతో హోటల్ క్లోజ్ అయ్యింది. ఫుడ్ స్టాల్ మూసి ఉందని తెలియక చాలా మంది హోటల్‌కు వచ్చి వెనక్కి వెళ్లిపోతున్నారు.
Elon Musk: అందరూ ఇస్మార్ట్ శంకర్‌లే.. మెదడు మీదే.. కానీ దానిపై కంట్రోల్ మాది..!
జరిగిన విషయం తెలిసి.. వీ వాంట్ కుమారి ఆంటీ బ్యాక్ అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ రేంజ్‌లో ఆంటీకి ఫాలోయింగ్ రావడానికి కారణం.. ఆంటీ చేసే లివర్ కర్రీ. కొన్ని రోజుల ముందు రెండు లివర్లు ఎక్స్‌ట్రా వేశాను మీ బిల్ తౌజెండ్ అయ్యింది అని ఆంటీ మాట్లాడే వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో తరువాతే ఈవిడ ఫుడ్ స్టాల్‌కు కస్టమర్ల సంఖ్య పెరిగింది. దీంతో కుమారి ఆంటీ దగ్గర లివర్ కర్రీ అంత బాగుంటుందా అని అంతా మాట్లాడుకున్నారు. ఈ కర్రీపై చాలా మంది కస్టమర్లు రివ్యూలు కూడా చెప్పారు. అక్కడ అన్ని స్టాల్స్‌లో దొరికే కర్రీస్ కంటే కుమారి ఆంటీ దగ్గర కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయని చెప్తున్నారు. అందుకే వేరే ఏరియాస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ తిని వెళ్తామని చెప్తున్నారు. కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ చుట్టూ కనిపించేవి అన్నీ సాఫ్ట్‌వేర్ కంపెనీలే.. ఫుడ్‌స్టాల్‌కు వచ్చే కస్టమర్లు మాత్రం అన్ని రంగాల వాళ్లు ఉంటారు. ఇక్కడి వచ్చే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా లివర్ కర్రీని టేస్ట్ చేస్తారు.
టేస్ట్ తగ్గట్టుగానే రేట్లు కూడా ఉంటాయి. ఆమె చెప్పే రేటు వినిషాకైనవాళ్లు కూడా ఫుడ్‌టేస్ట్ చేసిన తరువాత రిలాక్స్ అవుతారు. అలా సర్వ్ చేస్తోంది కాబట్టే కుమారి ఆంటీ హోటల్‌కు ఆ రేంజ్‌లో కస్టమర్లు వస్తున్నారు. ఇంత క్రేజ్ ఉన్న కుమారి ఫుడ్‌స్టాల్ విషయంలో ప్రభుత్వం కూడా స్పందించింది. ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హోటల్ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆమెపై నమోదు చేసిన కేసును కూడా ఎత్తివేయాలంటూ డీజీపీని ఆదేశించారు. దీంతో రేపటి నుంచి మళ్లీ కుమారి ఆంటీ హోటల్ తెరుచుకోనుంది.