Nalgonda BRS fight : కుమ్ములాటల్లో నల్లగొండ BRS నేతలు… కేసీఆర్ కి కొత్త సమస్య !

నల్లగొండ (Nalgonda) జిల్లా BRSలో వర్గ విభేదాలు, గ్రూపు రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. ఇందుకు బీఆర్ఎస్ (BRS) పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఛలో నల్లగొండ సభ వేదికైందట. ఛలో నల్లగొండ సభకు వచ్చే నేతలకు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) వేర్వేరుగా ఏర్పాటు చేసిన లంచ్ మీటింగే ఇందుకు నిదర్శనమని సొంత పార్టీ నేతలు అంటున్నారు.

నల్లగొండ (Nalgonda) జిల్లా BRSలో వర్గ విభేదాలు, గ్రూపు రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. ఇందుకు బీఆర్ఎస్ (BRS) పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఛలో నల్లగొండ సభ వేదికైందట. ఛలో నల్లగొండ సభకు వచ్చే నేతలకు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) వేర్వేరుగా ఏర్పాటు చేసిన లంచ్ మీటింగే ఇందుకు నిదర్శనమని సొంత పార్టీ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్‌ ప్రతిష్టాత్మక సభ నిర్వహించిన సమయంలో కీలక నేతలు…వేర్వేరు లంచ్ మీట్‌లతో జిల్లా బీఆర్ఎస్‌లో గ్రూపు రాజకీయాలు పరాకష్టకు చేరుకున్నాయట. దీన్ని కింది స్థాయి నేతలు, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఛలో నల్లగొండ (Chalo Nalgonda) సభకు ఆశించిన స్థాయిలో జన సమీకరణ చేయలేదనీ.. కొన్ని నియోజకవర్గాల నుంచి క్యాడర్ కాలు బయట పెట్టలేదని… బీఆర్ఎస్‌ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్‌ (BRS) సభకు జనం రాకపోవడానికి కొందరు మాజీ ఎమ్మెల్యేల వ్యవహారశైలే కారణమని నేతలు… అంతర్గత సమావేశాల్లో విమర్శలు గుప్పిస్తున్నారట. ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు… గ్రూపులు కట్టడానికి మాత్రం ప్లాన్ చేసుకుంటారని… పార్టీ సమావేశాలను సక్సెస్‌ చేయడానికి మాత్రం ప్రణాళికలు ఎందుకు తయారు చేయరని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమ నేపథ్యం ఉన్న నేతలు… నల్లగొండ సభ వేదికగా… రెండు గ్రూపులుగా విడిపోయి… పార్టీలో గ్రూపులను నడుపుతున్నారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన లంచ్‌ మీట్‌కు బీఆర్ఎస్ కీలక నేతలు హారీశ్‌రావు, కేటీఆర్, జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు ఇతర కీలక నేతలంతా పాల్గొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సూచన మేరకే లంచ్ మీట్ ఏర్పాటు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి… ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలను ఆ లంచ్ కు ఆహ్వానించినా రాకపోవడంతో… గ్రూపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా ఈ మాజీల్లో మార్పు రాలేదనీ… కీలక సభను గ్రూపు రాజకీయాలకు వేదికగా చేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారట. అధినేత కేసీఆర్‌ (KCR) పాల్గోనే సభను సక్సెస్ చేసి… వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాల్సిన తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారట. ఇన్నాళ్లు తెరవెనక రాజకీయాలు చేసిన నేతలు… తెరముందు గ్రూపు రాజకీయాలకు సిద్దపడటం ఎక్కడికి దారితీస్తుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ గ్రూపు పాలిటిక్స్ అంతటికీ కారణం… నల్లగొండ పార్లమెంట్‌ సీటేనన్న చర్చ నడుస్తోంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు గుత్తా అమిత్ రెడ్డిని… నల్లగొండ పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. కొడుకు పొలిటికల్ ఎంట్రీ కోసం సుఖేంధర్ రెడ్డి సీరియస్‌గానే ప్రయత్నిస్తున్నారట. గుత్తా వారసుడి పొలిటికల్ ఎంట్రీని వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు…ఇంత కాలంగా తెరవెనక రాజకీయాలు చేయగా… తాజా ఛలో నల్లగొండ సభతో తమ అభ్యంతరాన్ని పార్టీ పెద్దలకు చెప్పకనే చెప్పేసారట. అంతా కళ్లతో చూసిన బీఆర్ఎస్ బడా నేతలు… రాబోయే రోజుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రూపు రాజకీయాలకు ఎలా చెక్ పెడతారు ? ఎవరిని ఎలా సెట్ చేస్తారో చూడాలి…