Telangana BJP : తెలంగాణ బీజేపీలో ఎంపీ సీట్ల పంచాయితీ

తెలంగాణ కమలం పార్టీలో (Telangana BJP Party) .. ఎంపీ సీట్ల కోసం పోటీ భారీగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) కాస్త అటు ఇటుగా ఉన్నా.. లోక్‌సభ సీట్ల విషయంలో మాత్రం తగ్గేదే లే అంటున్నారట నాయకులు. ఆ ఎన్నికలకు, ఈ ఎలక్షన్స్‌కు ఈక్వేషన్స్‌ మారిపోతాయని.. ఇప్పుడు మోదీ ఇమేజ్ ప్లస్‌ అయి పార్లమెంట్‌ మెట్లు ఎక్కొచ్చని లెక్కలు చెబుతున్నారట నేతలు. అందుకే ఎంపీ టికెట్లకు పిచ్చ డిమాండ్‌ పెరుగుతోందని పార్టీ వర్గాలు అంటున్నాయ్.

తెలంగాణ కమలం పార్టీలో (Telangana BJP Party) .. ఎంపీ సీట్ల కోసం పోటీ భారీగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) కాస్త అటు ఇటుగా ఉన్నా.. లోక్‌సభ సీట్ల విషయంలో మాత్రం తగ్గేదే లే అంటున్నారట నాయకులు. ఆ ఎన్నికలకు, ఈ ఎలక్షన్స్‌కు ఈక్వేషన్స్‌ మారిపోతాయని.. ఇప్పుడు మోదీ ఇమేజ్ ప్లస్‌ అయి పార్లమెంట్‌ మెట్లు ఎక్కొచ్చని లెక్కలు చెబుతున్నారట నేతలు. అందుకే ఎంపీ టికెట్లకు పిచ్చ డిమాండ్‌ పెరుగుతోందని పార్టీ వర్గాలు అంటున్నాయ్. కొన్ని చోట్ల టికెట్‌ తెచ్చుకుంటే చాలు.. గెలిచేస్తామన్న అభిప్రాయం ఉందంటోంది కాషాయదళం. అందుకే ఎలాగైనా టికెట్ సాధించాలన్న పట్టుదలతో.. లోకల్‌, నాన్‌ లోకల్‌ ఈక్వేషన్స్‌ని కూడా తెర మీదికి తెస్తున్నారట కొందరు నాయకులు. స్థానికంగా పని చేసుకుంటున్న తమను కాదని.. ఎక్కడి నుంచో ఇంపోర్ట్‌ చేస్తే కుదరదని చెప్పేస్తున్నారట సదరు లీడర్స్‌.

ఈసారి కనీసం పది ఎంపీ సీట్లు కొట్టాలని..35 శాతం ఓట్లు సాధించాలన్నది కమలం పార్టీ పెద్దల టార్గెట్‌. అందుకే అభ్యర్థుల ఎంపికలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇలాంటి పరిణామాల మధ్య లోకల్‌, నాన్‌ లోకల్‌ నినాదం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. జహీరాబాద్, మల్కాజ్‌గిరి, నల్గొండ, మహబూబ్‌నగర్‌తో పాటు మరికొన్ని చోట్ల.. నియోజకవర్గానికి సంబంధంలేని వాళ్లు టికెట్ అడుగుతున్నారట. అందులోనూ అర్థ బలం ఉందని టికెట్ అడిగే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. దీనికి కౌంటర్‌గా స్థానిక నేతలు గళం వినిపిస్తున్నారు.

ఇన్నాళ్ళు కష్టపడింది తామైతే.. వాళ్ళకు టికెట్‌ ఎలా ఇస్తారన్నది లోకల్‌ లీడర్స్‌ వెర్షన్‌గా చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14శాతం ఓట్లు వచ్చాయి. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 25శాతం ఓట్లు పడ్డాయ్. దీంతో సీటు వదులుకోవడానికి లోకల్‌ లీడర్స్‌ నిరాకరిస్తుండగా.. ఇతరులు మాత్రం పైస్థాయిలో తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారట. లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ తమవైపే ఉంటుందని.. అసెంబ్లీ ఎలక్షన్స్‌ టైంలోనే వాతావరణం కనిపించిందని అంటున్నారు కొందరు బీజేపీ నేతలు. దీంతో సొంత నియోజకవర్గం లేని నాయకులు మల్కాజ్‌గిరి, జహీరాబాద్‌లాంటి వాటి మీద కన్నేశారట. ఈ రెండు చోట్ల నుంచి ఎక్కువ మంది ఆశావహులు రేస్‌లో ఉన్నట్టు తెలిసింది.

మల్కాజ్‌గిరి సీటును బీజేపీ సీనియర్ నేతలు మురళీధర్ రావు, ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి.. మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఆశిస్తున్నట్టు సమాచారం. జహీరాబాద్‌ను OBC మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్.. గత ఎన్నికల్లో పోటీ చేసిన బాణాల లక్ష్మా రెడ్డి, మురళీధర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిలాంటి నాయకులు ఆశిస్తున్నట్టు తెలిసింది. మెదక్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న మరికొందరు.. అది దక్కకుంటే జహీరాబాద్‌ కావాలని అడుగుతున్నట్టు తెలిసింది. దీంతో లోకల్‌, నాన్‌ లోకల్‌ వ్యవహారం రక్తి కట్టిస్తోంది. మరి కమలం పార్టీ అధిష్టానం ఏ వాదం వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.