Lok Sabha Elections 2024 : తమిళనాడులో మొదలైన లోక్ సభ ఎన్నికల పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముకులు

దేశంలో సార్వత్రి ఎన్నికల సమరం మొదలైంది. లోక్ సభ తొలి విడతలో దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాలు/యూటీల్లోని 102 సీట్లకు పోలింగ్ కొనసాగుతుంది. మన దిగువ రాష్ట్రాం అయిన తమిళనాడులో పోలింగ్ ఉదయం 7 గంటలకే మొదలైయింది. ఈ తొలి విడత ఎన్నికల్లో దక్షాణా రాజకీయ నేతల చూపు మొత్తం తమిళనాడు పైనే పడింది.

 

 

 

దేశంలో సార్వత్రి ఎన్నికల సమరం మొదలైంది. లోక్ సభ తొలి విడతలో దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాలు/యూటీల్లోని 102 సీట్లకు పోలింగ్ కొనసాగుతుంది. మన దిగువ రాష్ట్రాం అయిన తమిళనాడులో పోలింగ్ ఉదయం 7 గంటలకే మొదలైయింది. ఈ తొలి విడత ఎన్నికల్లో దక్షాణా రాజకీయ నేతల చూపు మొత్తం తమిళనాడు పైనే పడింది. ఈ సారి తమిళనాడులో పలువురు ప్రముఖులు ఎన్నికల బరిలో నిలిచారు.

ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీజేపీ పార్టీ తమిళనాడు రాష్ట్రా అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్‌ నటి రాధిక బీజేపీ తరఫున విరుధ్‌నగర్‌ బరిలో నిలిచారు. ఆమె ప్రత్యర్థిగా DMDK వ్యవస్థాపక అధ్యక్షుడు, నటుడు విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకర్‌ పోటీ చేస్తున్నారు. ఇక తెలంగాణలో వివాదస్పద గవర్నర్ గా పేరు తెచ్చుకున్న.. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. మరో వైపు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్న నేతలు.. చెన్నై- సీఎం స్టాలిన్, తమిళిసై, చెన్నై- పళనిస్వామి, చెన్నై- పన్నీర్ సెల్వం, కోయంబత్తూర్ – అన్నామలై, దక్షిణ నియోజకవర్గం – తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఓటు వేశారు. వీరితో పాటు రజినీకాంత్, కుష్బూ, కార్తీక్‌, అజిత్‌, శివకార్తీకేయన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

SSM