Ponnam Prabhakar: ఖరీదైన గిఫ్ట్‌ ! కొత్త వివాదంలో మంత్రి పొన్నం.. ఆ కారు మెడకు చుట్టుకుంటోందా ?

దాదాపు కోటిన్నర విలువైన కారులో మరో మంత్రి సీతక్కతో కలిసి ఆయన మేడారం వెళ్లారు. ఐతే ఎన్నికల ముందు వేరే కారులో తిరిగిన పొన్నం ప్రభాకర్.. ఈ కొత్త కారు ఎప్పుడు కొన్నారనే చర్చ సోషల్‌ మీడియాలో మొదలైంది.

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 04:43 PM IST

Ponnam Prabhakar: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రెస్‌మీట్‌లో ఆ మధ్య రిపోర్టర్‌ను బెదిరించారంటూ ఓ వీడియో వైరల్‌ కాగా.. అది మర్చిపోవడానికి ముందే.. ఇప్పుడు మరో కొత్త వివాదం ఆయన మెడకు చుట్టుకుంటోంది. కారును ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఐతే ఇప్పుడు అదే కారు.. కొత్త కాంట్రవర్సీకి కేరాఫ్‌ అయింది. పొన్నం వాడుతున్న నలుపు రంగు టొయొటా వెల్‌ఫైర్ కారు ఇప్పుడు వివాదాలకు తావిస్తున్నట్లు అవుతోంది.

AP DSC 2024: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, షెడ్యూల్ ఇదే..!

దాదాపు కోటిన్నర విలువైన కారులో మరో మంత్రి సీతక్కతో కలిసి ఆయన మేడారం వెళ్లారు. ఐతే ఎన్నికల ముందు వేరే కారులో తిరిగిన పొన్నం ప్రభాకర్.. ఈ కొత్త కారు ఎప్పుడు కొన్నారనే చర్చ సోషల్‌ మీడియాలో మొదలైంది. అయితే.. అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన కారు కావడంతో ఎవరైనా బంధువులది కావొచ్చని అంతా అనుకున్నారు. ఐతే నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఎవరి పేరిట ఉందని చెక్ చేస్తే.. ముత్యాల సునీల్ కుమార్ పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. ఆయన ఆరెంజ్ ట్రావెల్స్‌ అధినేత. ఆయనకు 550పైగా బస్సులు ఉన్నాయ్. ట్రావెల్స్ రంగంలో ఆయన చాలాకాలంగా ఉన్నారు. ట్రావెల్స్ నడుపుతున్నవారికి.. రవాణా శాఖతో ఎప్పుడూ పనే ఉంటుంది. అలాంటి రవాణా శాఖ మంత్రి దగ్గర, ట్రావెల్స్ అధినేత కారు ఉండటంపై కొత్త చర్చ మొదలైంది. మంత్రికి ఆ కారును గిఫ్ట్‌గా ఇచ్చారా.. లేకపోతే ఇద్దరి మధ్య ఉన్న స్నేహంతో వాడుకోమని ఇచ్చారా అనే విషయంపై సోషల్‌ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయ్.

కోటిన్నర విలువ చేసే కారును వాడుకోమని అయితే ఎవరూ ఇవ్వరు. అలాంటిది మంత్రికి ఇచ్చారంటే.. దీని వెనక ఏదో మతలబు ఉందన్నది మరికొందరి అనుమానం. ఇదంతా ఎలా ఉన్నా.. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. రవాణాశాఖకు సంబంధించిన రూల్స్ అన్నీ ఖచ్చితంగా పాటించాలని వాహనదారులకు చెప్పాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఐతే ఆయన వాడుతున్న వెల్‌ఫైర్ కారుపై 11 చలాన్లు ఉన్నాయ్‌. దీన్ని కూడా ఇప్పుడు నెటిజన్లు హైలైట్‌ చేస్తున్నారు.