Modi’s election campaign : దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు (National General Elections) సమీపీస్తున్నాయి. మూడో సారి ప్రధాని పగ్గాలు అందుకునేందుకు నరేంద్ర మోదీ (Modi) వ్యూహాలు రచిస్తున్నారు. కాగా మూడు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు.

 

 

 

దేశంలో సార్వత్రిక ఎన్నికలు (National General Elections) సమీపీస్తున్నాయి. మూడో సారి ప్రధాని పగ్గాలు అందుకునేందుకు నరేంద్ర మోదీ (Modi) వ్యూహాలు రచిస్తున్నారు. కాగా మూడు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ… లోక్ సభ ఎన్నికల పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెడుతు.. తెలంగాణ పర్యటనకు రానున్నారు మోదీ. తెలంగాణ లోక్​సభ ఎన్నికల్లో (Telangana Lok Sabha Elections) గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) రేపు మార్చి 15 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తెలంగాణలో 16,17,18 తేదీల్లో మోదీ పర్యటించే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ(BJP) రాష్ట్రనాయకత్వం తెలిపింది. మూడు బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనేలా పార్టీ వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. జగిత్యాల, నాగర్​ కర్నూల్, మల్కాజిగిరిల్లో ప్రధాని సభలు నిర్వహించాలని భావిస్తోంది. మూడు లోక్​సభ స్థానాలు కవర్ చేసే విధంగా ఒక్కో సభ పెట్టాలని బీజేపీ యోచిస్తోంది.

తెలంగాణ మోదీ పర్యటనలో స్వల్ప మార్పులు..
వాస్తవానికి ఈ నెల 16 నుంచి ప్రధాని తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రధాని పర్యటనలో స్వల్ప మార్పులతో ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మోదీ ఎన్నికల ప్రచారంలో స్వల్పమార్పులు జరగినట్లు.. బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మొదట ఈనెల 16వ ప్రకటనలు తేదీన ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తారని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం వచ్చినా… తాజాగా ఈనెల 15ననే ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. ఈనెల 15వ తేదీన హైదరాబాద్ కు వచ్చే ప్రధాని అదేరోజు మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టే రోడ్ షోలో పాల్గొననున్నారు. 16వ తేదీన నాగర్ కర్నూల్లో, 18న జగిత్యాలలో బీజేపీ ఎన్నికల బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. ఈనెల 15న మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు గంటన్నరసే పు భారీ రోడ్ షో ఉంటుందని బీజేపీ నేతలు వివరించారు. ఇప్పటికే ప్రధాని మోదీ ఈ నెల 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ సుడిగాలి పర్యటనలు..

ఈ నెల 15, 16 తేదీలతో పాటు 18న కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ… పాల్గొననున్నారు. ప్రధాని ఎన్నికల ప్రచారంతో బీజేపీ శ్రేణుల్లోజోష్ వచ్చింది. తాజాగా మరో మారు మూడు రోజులపాటు ప్రధాని తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుం డడంపై బీజేపీ నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధాని దక్షిణాది రాష్ట్రాలపై దూకుడు పెంచారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోడీ పర్యటనలు చేపడుతున్నారు.