తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) ఓడిపోయింది. కేవలం నెలరోజుల్లో పదేళ్ళ పాలకులు దిగిపోయారు. నెల రోజులు తిరగకముందే ప్రధాన పార్టీలో రాజకీయ వలసలు మోదలైయ్యాయి. పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు… ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోగానే ప్రక్కపార్టీల వైపు చూస్తున్నారు. వరుసగా కాంగ్రెస్ (Congress) తో మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాదు ఈ నెల 10న కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి తాటికొండ రాజయ్య అసంతృప్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా.. కచ్చితంగా పార్లమెంట్ (Parliament) ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారని, రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తారనే నమ్మకంతో అప్పట్లో సర్దుకుపోయారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో నైన్ క్రియర్ అవ్వడంతో కాంగ్రెస్ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాటికొండ రాజయ్య పార్టీ మారడానికి ప్రధాన కారణం.. వరంగల్ పార్లమెంట్( Warangal Parliament) స్థానాన్ని ఆశించిన రాజయ్యకు ఆ పార్టీ అధిష్టానం నుంచి సరైన స్పందన రాకపోవడం, టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో, అసంతృప్తికి గురై బీఆర్ఎస్ పార్టీకి( BRS ) రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా రాజయ్య స్టేషన్ ఘనపూర్ లో మీడియాతో మాట్లాడుతూ… మాదిగ ఆస్థిత్వంపై దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని తాటికొండ రాజయ్య ఆరోపించారు. కేసీఆర్ (KCR) “నన్ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినా… బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసినా… బీఆర్ఎస్ పార్టీకు నేను విధేయుడిగా ఉన్నాను. స్థానిక, రాష్ట్ర నాయకత్వం లోపంతో కార్యకర్తలు, నాయకులు కష్టాల పాలవుతున్నారని, ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి ఈరోజుకీ లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్ నవ్య vs తాటికొండ రాజయ్య (Sarpanch Navya vs Tatikonda Rajaiah) మధ్య వివాదం తీరస్తాయికి చేరింది. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు ఎంపీ టికెట్ కాంగ్రెస్ అధిష్టానం ఇస్తుందన్న అనుమానం లేకపోలేదు.