REVANTH REDDY: మెట్రో ప్రాజెక్టు రద్దు చేయం.. పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో: సీఎం రేవంత్

ఎయిర్ పోర్టు మెట్రో విషయంలో దూరాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ అంశంపై సోమవారం రేవంత్ స్పష్టత ఇచ్చారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ పోర్టు మెట్రోలో మార్పులు చేస్తున్నామన్నారు.

  • Written By:
  • Updated On - January 1, 2024 / 06:19 PM IST

REVANTH REDDY: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టు, ఫార్మా సిటీ ప్రాజెక్టులను తమ ప్రభుత్వం రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుల కొనసాగింపుపై సందేహాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని రద్దు చేస్తుందనే ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేమీ లేదని రేవంత్ ప్రకటించారు. అయితే, ఎయిర్ పోర్టు మెట్రో విషయంలో దూరాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.

REVANTH REDDY: సంక్రాంతి తర్వాతే కేబినెట్ విస్తరణ.. ఆ పార్టీల ఎమ్మెల్యేల కోసం 3 రిజర్వ్..!

ఈ అంశంపై సోమవారం రేవంత్ స్పష్టత ఇచ్చారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ పోర్టు మెట్రోలో మార్పులు చేస్తున్నామన్నారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి ఎయిర్ పోర్టుకు 32 కిలో మీటర్ల దూరం ఉంటున్నందున.. ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్ పోర్టుకు వెళ్లే మెట్రో లైనుకు అనుసంధానిస్తామం. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, ఇటు మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, నానక్ రామ్‌గూడ వరకు పొడిగిస్తాం. మేం కొత్తగా ప్రతిపాదించనున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయి అని రేవంత్ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఫార్మా సిటీ, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య జీరో పొల్యుషన్‌తో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.

ఈ ప్రత్యేక క్లస్టర్ల దగ్గర పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు ఇళ్ల నిర్మాణం చేపడతామని కూడా హామీ ఇచ్చారు. కార్మికులు హైదరాబాద్‌ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. యువతకు అవసరమైన స్కిల్స్ పెంపొందించడానికి ప్రత్యేక యూనివర్సిటీలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలు, ఇండస్ట్రియలిస్ట్స్ ద్వారా యువతకు అవసరమైన శిక్షణ ఇప్పిస్తామని, ఈ స్కిల్స్‌కు సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలుంటాయని రేవంత్ అన్నారు.