REVANTH REDDY: కొత్త సంవత్సర వేళ.. ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతీ నెలా 5వ తేదీలోగా జీతాలు, పెన్షన్లూ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరంలో డిసెంబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లూ జనవరి 5 లోపు వచ్చేస్తాయ్. ఐతే గుడ్‌న్యూస్ అన్నది ఇది కాదు.. డీఏ చెల్లించేందుకు సర్కార్ సిద్ధం అయింది. ఒకే విడతలో డీఏ చెల్లిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దీంతో ఈసారి డీఏ ఒకే విడతలో వచ్చే అవకాశం కనిపిస్తోంది.
T CONGRESS: ఎప్పుడంటే.. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారంటే..
అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉద్యోగులకు.. గత ప్రభుత్వం 3 డీఏలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అవి పెండింగ్‌లో ఉన్నాయ్. ఐతే ఇంతలోనే ఎన్నికల కోడ్ వచ్చేసింది. దీంతో డీఏలు చెల్లించలేకపోయింది. ఒక డీఏ చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనికి సరేనన్న ఈసీ.. ఒక డీఏ విడుదలకు డిసెంబర్ 2న అనుమతి ఇచ్చింది. ఐతే గత ప్రభుత్వం ఒక డీఏ విడుదల చేసి ఉంటే.. ఇంకా రెండు డీఏలు పెండింగ్ ఉంటాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే విడదల డీఏ చెల్లిస్తామని చెప్పింది. దీంతో పెండింగ్‌లో ఉన్న డీఏలన్నీ.. ఒకేసారి చెల్లించే అవకాశాలు ఉన్నాయ్. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగానే అన్నీ చేస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు అది మంచి వార్తే అవుతుంది. గత ప్రభుత్వం జీతాలను టైముకి చెల్లించలేదనీ.. డీఏ కూడా పెండింగ్స్ పెట్టిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వమైనా తమకు అనుకూలంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అంటోంది. అదే జరిగితే.. ఉద్యోగుల్లో ఆనందం కనిపించే అవకాశం ఉంది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా చెల్లిస్తున్నారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేపదే ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు 5లోపు జీతాలు చెల్లించి మాట నిలబెట్టుకుంటే.. వారికి భారీ ప్లస్ కావడం ఖాయం. డీఏ, సకాలంలో జీతాల చెల్లింపుపై కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే.. ఉద్యోగులకు అది ముమ్మాటికి గుడ్‌న్యూసే!