REVANTH REDDY: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఆరు గ్యారంటీల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సర్కార్.. జనాల నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది. అధికారంలోకి రాగానే ఆరు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. హామీల అమలుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు.
YS SHARMILA: ఎక్కడా కనిపించని జగన్, షర్మిల మీటింగ్ ఫొటోలు.. వాటిని ఆపింది ఆయనేనా..?
ప్రస్తుతం ఈ స్కీమ్ ద్వారా ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు. ఆరు హామీల్లో చివరి పథకం కింద 10 లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అమలు చేశారు. ప్రస్తుతం ఈ రెండూ అమల్లో ఉండగా.. ఈ నెలాఖరులోగా మరో హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 5వందలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు 2,500 నెలవారీ నగదు హామీ కూడా ఉంది. జనవరి నెలాఖరు నుంచి అర్హులైన మహిళలకు 2వేల 5వందల రూపాయల నగదు చెల్లించే ప్రక్రియకు.. రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరికొద్దిరోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. దీంతో అంతకుముందే పథకం అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి.. ఆర్థిక శాఖతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్కీమ్.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది.
ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలపై అధ్యయనం చేసి ప్రతినెలా ఎంత అవసరమో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. కర్ణాటకలో దాదాపు మూడున్నర కోట్ల మంది మహిళలు ఉండగా.. వారిలో కోటి 25 లక్షల మందికి నెలవారీ భృతి చెల్లిస్తున్నారు. అక్కడ ఇచ్చిన ప్రతిపాదనను తెలంగాణలో కూడా చెల్లిస్తే ఎంత మందికి ఇవ్వాల్సి ఉంటుందనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.