REVANTH REDDY: తెలంగాణలో 18 జిల్లాలే.. రేవంత్‌ వ్యూహం అదేనా..

ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయ్. ఐతే గత ప్రభుత్వం అడ్డగోలుగా, పద్ధతి పాటించకుండా జిల్లాలను డివైడ్ చేసిందని.. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు జిల్లాల సంఖ్య తగ్గిస్తారనే ప్రచారం తెలంగాణలో ఊపందుకుంది.

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 03:55 PM IST

REVANTH REDDY: 10 జిల్లాల తెలంగాణను.. 33జిల్లాలుగా చేసింది బీఆర్ఎస్ సర్కార్. ఐతే ఇప్పుడు తెలంగాణలో జిల్లాల సంఖ్యపై మళ్లీ కొత్త చర్చ మొదలైంది. తెలంగాణలో 33 జిల్లాలు ఎందుకని.. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కోసం జ్యుడిషియల్‌ కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ మధ్యే రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయ్. ఐతే గత ప్రభుత్వం అడ్డగోలుగా, పద్ధతి పాటించకుండా జిల్లాలను డివైడ్ చేసిందని.. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు జిల్లాల సంఖ్య తగ్గిస్తారనే ప్రచారం తెలంగాణలో ఊపందుకుంది.

CM Revanth : చాలామంది కేసీఆర్ కోవర్టులు.. ఏరివేసే పనిలో సీఎం రేవంత్

పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయ్. 17 పార్లమెంట్ స్థానాలతో పాటు హైదరాబాద్‌లో కొత్తగా మరో జిల్లా ఏర్పాటుతో 18కి జిల్లాల సంఖ్యను కుదిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ములుగు, జగిత్యాల, వనపర్తి, నారాయణపేట, గద్వాలలాంటి జిల్లాలు విస్తీర్ణంలో చాలా చిన్నవి. కొన్నిచోట్ల రెండు నియోజకవర్గాలకు కలిపి ఒక జిల్లా… మరో చోట ఒక నియోజకవర్గం జిల్లాగా ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి జిల్లాలను ఎత్తేసే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయ్. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 అని అందుకే ఆయన 33 జిల్లాలు ఏర్పాటు చేశారని.. ఇప్పుడు రేవంత్ లక్కీ నంబర్‌ 9 అని అందుకే ఆయన జిల్లాల సంఖ్యను 18కి కుదించే ప్రయత్నాలు చేస్తున్నారన్న మరో చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. వినడానికి కామెడీగా ఉన్నా.. ఈ చర్చ అయితే జోరుగా సాగుతోంది.

ఇక ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలులాంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడం.. జిల్లా కేంద్రాల సమీపంలో ఉన్న భూముల రేట్లు కూడా పెరగడంతో.. ఇప్పుడు పునర్‌వ్యవస్థీకరణ పేరిట జిల్లాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తే.. జనాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను కుదిస్తుందా.. లేదంటే ఇది ప్రచారంగానే మిగులుతుందా అనేది చూడాలి మరి.