REVANTH REDDY: 6 వద్దు 9 ముద్దు.. 6ను నమ్ముకుని కేసీఆర్ మునిగిపోయాడు.. నేను 9లో ఉంటా..

సీఎం రేవంత్‌ రెడ్డి లక్కీ నెంబర్‌ 9. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చాలా సార్లు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. చాలా విషయాల్లో ఈ నెంబర్‌ను ఆయన ఫాలో అవుతుంటారు. ఆఖరికి ఆయన కార్ల నెంబర్లు కూడా 9 ఉంటుంది.

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 06:08 PM IST

REVANTH REDDY: న్యూమరాలజీ అంటే కొందరికీ విపరీతమైన నమ్మకం ఉంటుంది. అంకెలతో రాతలు మారిపోతాయని నమ్మేవాళ్లు సొసైటీలో చాలా మంది ఉంటారు. దేంట్లో తేడా వచ్చినా ఓకే కానీ.. నెంబర్‌లో మాత్రం తేడా రానివ్వరు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఈ బ్యాచ్‌లో ఒకరే. సీఎం రేవంత్‌ రెడ్డి లక్కీ నెంబర్‌ 9. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చాలా సార్లు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. చాలా విషయాల్లో ఈ నెంబర్‌ను ఆయన ఫాలో అవుతుంటారు. ఆఖరికి ఆయన కార్ల నెంబర్లు కూడా 9 ఉంటుంది.

Aditya L1: లక్ష్యాన్ని చేరుకున్న ఆదిత్య ఎల్‌-1.. ఇస్రో మరో ఘనత

ఇప్పుడు సెక్రటేరియట్‌లో సీఎం ఛాంబర్‌ విషయంలో కూడా లక్కీ నెంబర్‌ను ఫాలో అవుతున్నారు రేవంత్‌ రెడ్డి. ప్రస్తుతం ఆరో ఫ్లోర్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌ను 9వ ఫ్లోర్‌కి మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను సీఎం ఆదేశించారట. సీఎం లక్కీ నెంబర్‌ 9 కావడం వల్లే తన ఛాంబర్‌ను 9వ ఫ్లోర్‌కి మార్చుకుంటున్నారంటూ సెక్రటేరియట్‌ వర్గాలు చెప్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌ కూడా న్యూమరాలజీని బాగా నమ్ముతారు. కేసీఆర్‌ లక్కీ నెంబర్‌ 6. చాలా విషయాల్లో ఆయన ఇదే నెంబర్‌ను నమ్ముకుని చాలా పనులు చేశారు. సెక్రటేరియట్‌లో తన ఛాంబర్‌ను కూడా 6వ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసుకున్నారు.

ప్రభుత్వం మారిపోయి, రేవత్‌ సీఎం ఐన తరువాత ఆ ఛాంబర్‌ రేవంత్‌ రెడ్డికి దక్కింది. తన లక్కీ నెంబర్‌ కానప్పుడు తానెందుకు కూర్చోవాలి అనుకున్నారో ఏంటో.. వెంటనే తన లక్కీ నెంబర్‌ ఫ్లోర్‌కే ఛాంబర్‌ను మార్పించుకోవాలి అని డిసైడయ్యారు. ఇప్పటికే 9వ ఫ్లోర్‌ను రేవంత్ రెడ్డి పరిశీలించారట. త్వరలోనే ఆయన ఛాంబర్‌ మొత్తాన్ని 9వ ఫ్లోర్‌కు మార్చబోతున్నారు అధికారులు.