SANKRANTHI HOLIDAYS: జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ

జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సంక్రాంతి సెలవులుగా నిర్ణయించింది. జనవరి 17, బుధవారం జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది.

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 08:19 PM IST

SANKRANTHI HOLIDAYS: తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది ఇంటర్ బోర్డు. జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సంక్రాంతి సెలవులుగా నిర్ణయించింది. జనవరి 17, బుధవారం జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. సంక్రాంతి సెలవుల సమయంలో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.

REVANTH REDDY: 6 వద్దు 9 ముద్దు.. 6ను నమ్ముకుని కేసీఆర్ మునిగిపోయాడు.. నేను 9లో ఉంటా..

ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు గతంలోనే ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలోని మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని బడులకు ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 13న రెండో శనివారం, 14 ఆదివారం నాడు భోగి ఉంది. ఇక 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. 18వ తేదీన బడులు తిరిగి పునఃప్రారంభమవుతాయి. ఇక ఏపీకి సంబంధించి.. జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. జనవరి 13 రెండో శనివారం, జ‌న‌వ‌రి 14న భోగి పండ‌గ, 15న ఆదివారం సెలవులు కాగా.. 16న సంక్రాంతి సందర్భంగా ఆప్షన‌ల్ హాలీడే ఇవ్వనున్నారు. దీంతో పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు మ‌రో రెండు రోజులు పాటు అద‌నంగా సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. మొత్తంగా ఏపీలో బడులు, కాలేజీల‌కు దాదాపు ఆరు రోజులు పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది.

జనవరిలో నాలుగు ఆదివారాలు కలిపితే చాలా సెలవులు రానున్నాయి. జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోసారి వరుస సెలవులు రానున్నాయి. ఏపీలో విద్యార్థులకు 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెలవులు వస్తున్నాయి.