PRANEETH RAO : ట్యాపింగ్ కేసులో సంచలనాలు ! ప్రణీత్ రావు వెనుక పెద్దలెవరు ?

తెలంగాణలో (Telangana) ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆయన్ని సిరిసిల్లలో అరెస్ట్ చేసి రహస్యంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ టైమ్ లో అయినా హైదరాబాద్ కు తరలిస్తారని సమాచారం.

 

 

 

తెలంగాణలో (Telangana) ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆయన్ని సిరిసిల్లలో అరెస్ట్ చేసి రహస్యంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ టైమ్ లో అయినా హైదరాబాద్ కు తరలిస్తారని సమాచారం. హైదరాబాద్ లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ DSP గా పనిచేస్తున్న ప్రణీత్ రావు ఫిబ్రవరి20న ట్రాన్స్ ఫర్ మీద సిరిసిల్లలో జాయిన్ అయ్యారు. రిపోర్ట్ చేసిన వెంటనే హైదరాబాద్ కి వెళ్ళిపోయారు. అయితే గత ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహా కొందరు ప్రతిపక్ష నేతలు, అధికారుల ఫోన్లను ప్రణీత్ రావు టాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలతోనే ఈనెల 5న సస్పెండ్ అయ్యారు.

ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్ నెంబర్స్ ను ప్రణీత్ రావు టాపింగ్ చేసినట్టు గుర్తించారు. ముఖ్యమైన నాయకులు, వారి అనుచరుల కదలికలపై నిరంతరం ఆయన టీం నిఘా పెట్టింది. హైదరాబాద్ నుంచి ఎవరు డబ్బులు తరలించినా ప్రణీత్ రావుకి ముందే సమాచారం తెలిసిపోయేది. ఆ జిల్లా పోలీసులకి సమాచారం అందించి… వాటిని సీజ్ చేయించేవాడు. BRS ప్రభుత్వంలో పెద్దల అండతోనే ఈ నిఘా వ్యవహారాలు కొనసాగినట్టు తెలుస్తోంది. అందుకే సర్కార్ మారగానే… SIBలోని హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడంతో పాటు రికార్డులను కూడా నాశనం చేసినట్టు తేలింది. దాంతో ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేస్ పెట్టారు. SIBలో కీలకంగా పనిచేసిన మాజీ అధికారి పాత్రపైనా పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రణీత్ రావు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, ఇతర డేటాను రీట్రీవ్ చేసే పనిలో ఉన్నారు. అతను ఎవరెవరి ఫోన్లు టాపింగ్ చేసాడనే సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. ఫోన్ టాపింగ్ చేసిన వివరాలను ఎప్పటికప్పుడు ఓ ఉన్నతాధికారికి ప్రణీత్ రావు పంపినట్టు గుర్తించారు.

SIBలో ప్రణీత్ రావు (Praneet Rao) కు ప్రత్యేక టీమ్ ను మాజీ IPS అధికారి ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఏర్పాటు చేసినట్టు తెలిసింది. రెండు రూముల్లో ఇంటర్నెట్ కనెక్షన్ తో 17 కంప్యూటర్లను మెయింటైన్ చేసినట్టు తెలిసింది. ప్రణీత్ రావ్ కు సహకరించిన మాజీ, ప్రస్తుత అధికారులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలవాలని పంజాగుట్ట పోలీసులు నిర్ణయించారు. ఈ కేసును సీఐడీ (CID) లేదా సిట్ కు బదిలీ చేసే అవకాశాలున్నాయి. సస్పెండ్ అయిన మాజీ DSP ప్రణీత్ రావు… అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో భారీగా ఆస్తులు కొన్నట్టు తేలింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసును సీరియస్ గా తీసుకోవడంతో ప్రణీత్ కు సహకరించిన ఉన్నతాధికారులు భయపడుతున్నారు. అలాగే గత ప్రభుత్వ పెద్దల అండతోనే ప్రణీత్ రావు ట్యాపింగ్ కి పాల్పడంతో ఎవరా పెద్దలు అన్నదానిపైనా పోలీసుల విచారణ కొనసాగుతోంది.