బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో CMO కార్యదర్శిగా పనిచేసిన స్మితా సభర్వాల్ (Smita Sabharwal)… నీటిపారుదల శాఖకు సంబంధించిన వ్యవహారాలను చూశారు. ప్రభుత్వ పథకాల్లో కీలకమైన మిషన్ భగీరథ, RWS విభాగాలకు అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజిత్ కుమార్ రిటైర్డ్ అవ్వగానే దాని అడిషినల్ ఛార్జ్ కూడా స్మితకే కేటాయించింది కేసీఆర్ సర్కార్. ఇలా BRS ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించి… CMO లో ఓ వెలుగు వెలిగారు. దేశంలోనే నిత్యం హెలికాప్టర్ లో తిరిగిన IAS గా కూడా ఆమెపై విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలోని ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్షలు చేయాలన్నా… స్మితా సభర్వాల్ కు కేసీఆర్ సర్కార్ హెలికాప్టర్ సమకూర్చింది. అప్పట్లో ఆమె చర్యలు, X వేదికగా చేసిన కామెంట్స్ వివాదస్పదం అయ్యాయి.
బీఆర్ఎస్ సర్కార్ పోయి… సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు సీఎం, మంత్రులు… మొదటిసారి సెక్రటరిటయేట్ లోకి అడుగుపెట్టిన రోజు గానీ… ఆ తర్వాత IPS, IASలంతా సీఎం, కేబినెట్ సహచరులను కలుసుకొని విషెస్ చెప్పిన రోజున గానీ… స్మితా సభర్వాల్ ఆ దరిదాపుల్లోకి రాలేదు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా స్మిత సభర్వాల్ అటెండ్ కాలేదు. దాంతో స్మిత కేంద్ర సర్వీసులకు వెళతారనీ… అప్లయ్ కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తర్వాత ఆమె ఖండించారు. తాను తెలంగాణ అధికారిణిగా పనిచేయడానికి గర్వంగా ఫీల్ అవుతానంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. కొత్త ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానని తెలిపారు స్మిత సభర్వాల్.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మితా సభర్వాల్ వ్వవహార శైలిపై కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంది. దాంతో IASల బదిలీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి…ఆమెను ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులో వేయించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు. ఇది డిప్యూటీ కలెక్టర్ స్థాయి పోస్టు… గ్రామ పంచాయతీలకు నిధులను మంజూరు చేయాలని సిఫార్సు చేయడం తప్ప… వేరే ఎలాంటి పనీ ఉండదు. ఏ అధికారిని అయినా లూప్ లైన్లో పెట్టాలి… అప్రధాన్య పోస్టు ఇవ్వాలి అనుకుంటే… ఇలాంటి పోస్టులకే ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఇప్పుడు స్మితా సభర్వాల్ ను కూడా ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులో వేశారు సీఎం రేవంత్ రెడ్డి.