Smita Sabharwal: నేను.. ఆయన కలిసే ఉన్నాం.. స్మిత సబర్వాల్ పోస్ట్

స్మితా సబర్వాల్ భర్త, సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ప్రస్తుతం కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు. ఆమె భర్త కేంద్ర సర్వీసులో ఉండిపోవడంతో వీరిద్దరికీ మనస్పర్ధలు వచ్చాయని.. దూరంగా ఉంటున్నారని.. త్వరలో విడాకులు తీసుకుంటారని కూడా వదంతులు వచ్చాయి.

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 05:26 PM IST

Smita Sabharwal: స్మితా సబర్వాల్.. తెలంగాణ క్యాడర్ వివాదాస్పద ఐఏఎస్ అధికారిణి. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగల్ హ్యాండ్‌తో సీఎం కార్యాలయాన్ని శాసించిన మహిళా అధికారిణి స్మిత. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మిత కేంద్ర సర్వీస్‌కి వెళ్లిపోతారని వదంతులు వచ్చాయి. వాటికి తోడు ఆమె ముఖ్యమంత్రి రేవంత్‌ని గాని.. మిగిలిన శాఖల మంత్రులనుగాని కలవడానికి రాకపోవడం ఆ వదంతులకి బలం చేకూర్చింది. ఇదే సమయంలో కేంద్ర సర్వీసులకు వెళ్లాలన్న స్మిత సబర్వాల్ ప్రయత్నం ఫలించలేదు. మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డి.. స్మిత సబర్వాల్ స్థానంలో మరో మహిళ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని రప్పించారు.

MLC ELECTIONS: కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌‌కు హైకోర్టు షాక్.. ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారంపై స్టే

స్మిత సబర్వాల్‌కు ఎటువంటి ప్రాధాన్యం లేని స్టేట్ ప్లానింగ్ కమిషన్ మెంబర్‌గా పోస్టింగ్ ఇచ్చి పక్కన పెట్టారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర సర్వీస్ నుంచి కేంద్ర సర్వీస్‌లకు ప్రయత్నిస్తే కొత్త వదంతులకు తావిచ్చినట్లు అవుతుందని స్మిత ప్రస్తుతానికి నిశ్శబ్దంగా ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచూ ట్విట్టర్లో వివాదాస్పద అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. స్మితా సబర్వాల్ భర్త, సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ప్రస్తుతం కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు. దేశభద్రతా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్మితా సబర్వాల్ హైదరాబాదులో ఉండడం, ఆమె భర్త కేంద్ర సర్వీసులో ఉండిపోవడంతో వీరిద్దరికీ మనస్పర్ధలు వచ్చాయని.. దూరంగా ఉంటున్నారని.. త్వరలో విడాకులు తీసుకుంటారని కూడా వదంతులు వచ్చాయి. వాటన్నింటికీ సమాధానం చెబుతూ ఇటీవల స్మిత సెలవు పెట్టి, భర్త అకున్ సబర్వాల్‌తో కలిసి తన సొంత ఊరు షిల్లాంగ్‌కి వెళ్లారు. షిల్లాంగ్ ట్రిప్‌లో ఉండగా భర్తతో కలిసి తీసుకున్న ఫోటోను స్మిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో ద్వారా తామిద్దరం విడిపోయారని వస్తున్న పుకార్లకు సబర్వాల్ తానే ఫుల్ స్టాప్ పెట్టారు.

షిల్లాంగ్‌కు చెందిన బెంగాలీ కుటుంబంలో పుట్టిన స్మితా సబర్వాల్ అసలు పేరు స్మిత దాస్. తండ్రి కల్నల్ ప్రణబ్ దాస్. స్మిత బాల్యం నుంచి హైదరాబాదులోనే పెరిగారు. సికింద్రాబాద్‌లో చదువుకున్నారు. ఐసిఎస్ఇలో ఆమె ఇండియాలోనే టాపర్. 2001లో 22 ఏళ్లకే ఐఏఎస్‌కి ఎంపికయ్యారు. తెలంగాణ క్యాడర్‌కు బ్యూరోక్రాట్‌గా వచ్చారు. పేరుకి పశ్చిమ బెంగాల్, షిల్లాంగ్‌‌కు చెందిన వాళ్ళైనా.. స్మిత బాల్యం నుంచి హైదరాబాదులోనే ఉన్నారు. అందుకే ఇక్కడ స్థిరపడ్డారు. 46 ఏళ్ల స్మిత సబర్వాల్‌కు ఇద్దరు పిల్లలు. తెలంగాణ సీఎం కార్యాలయంలో తొలి మహిళా అధికారి ఆమె. మొత్తం మీద భర్తతో దిగిన ఫోటోలు షేర్ చేయడం ద్వారా స్మిత చాలా వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టారు.