Skitha Sabharwal : తొలి రోజే స్మితా సబర్వాల్‌ ఆసక్తికర ట్వీట్‌..

తెలంగాణలో ప్రభుత్వం మారిపోయిన తరువాత చాలా మంది తలరాతలు కూడా మారిపోయాయి. రాజకీయ నాయకులే కాదు.. చాలా మంది అధికారుల పరిస్థితి కూడా తారుమారయ్యింది. ఇందులో ముఖ్యంగా ఐఏస్‌ (IAS) స్మితా సబర్వాల్‌ (Skitha Sabharwal) పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది.

తెలంగాణలో ప్రభుత్వం మారిపోయిన తరువాత చాలా మంది తలరాతలు కూడా మారిపోయాయి. రాజకీయ నాయకులే కాదు.. చాలా మంది అధికారుల పరిస్థితి కూడా తారుమారయ్యింది. ఇందులో ముఖ్యంగా ఐఏస్‌ (IAS) స్మితా సబర్వాల్‌ (Skitha Sabharwal) పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్మితా సబర్వాల్‌ రేంజ్‌ వేరు. ఇరిగేషన్‌ శాఖలో (Irrigation Department) కీలక బాధ్యతలు చేపట్టిన స్మితా.. సీఎంవో సెక్రెటరీగా కూడా పని చేశారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt) వచ్చిన తరువాత కీలక బాధ్యతల నుంచి స్మితను తప్పించారు సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy). ఆర్థిక శాఖ (Finance Department) కార్యదర్శగా ఆమెను నియమించారు.

పంజాగుట్టలోని ఫైనాన్స్‌ కమిషన్‌ ఆఫీస్‌లో స్మిత బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి రోజే స్మిత చేసిన ట్వీట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో సర్పంచ్‌లుగా పని చేస్తున్న ప్రతీ ఒక్కరూ సలహాలు సూచనల కోసం ఫైనాన్స్‌ కమిషన్‌ ఆఫీస్‌ రావొచ్చంటూ ట్వీట్‌ చేశారు. ఆఫీస్‌ అడ్రస్‌ను కూడా ట్వీట్‌లో మెన్షన్‌ చేశారు. దీంతో ఎలా ఉండే స్మిత పరిస్థితి ఎలా మారిపోయిందని అంతా మాట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్మితా సబర్వాల్‌ చాలా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇరిగేషన్‌ శాఖతో పాటు సీఎంవో సెక్రెటరీగా (CMO Secretary) పని చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు స్మిత చాలా దగ్గరి మనిషి అనే పేరుంది. ఆ సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని ఆమె చాలా పనులు చేయించుకున్నారు అనే ఆరోపణ కూడా ఉంది.

ఈ కారణంగానే రేవంత్ ప్రభుత్వం స్మితను పెద్దగ ప్రధాన్యత లేని పోస్ట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారనే వాదన ఉంది. నిజానికి ఇప్పుడు స్మితను ట్రాన్స్‌ఫర్‌ చేసిన పోస్ట్‌ డిప్యుటీ కలెక్టర్ స్థాయిది. గ్రామ పంచాయతీలకు నిధులు మళ్లించడం తప్ప వేరే పెద్ద బాధ్యతలేం ఉండవు. ఎవరైనా అధికారిని పూర్తగా బాధ్యత నుంచి తొలగించకుండా లూప్‌లైన్‌లో పెట్టేందుకు ఇలాంటి ప్రధాన్యత లేని పోస్ట్‌లు ఇస్తుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు స్మితను కూడా లూప్‌లైన్‌లో రేవంత్ సర్కార్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న స్మిత.. ఈ ప్రభుత్వంలో ఇలాంటి పోస్ట్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది.