Sunil Kanugolu: లోక్ సభ ఎన్నికలకు వద్దు ! సునీల్ వ్యూహం రాష్ట్రాలకే ..

దక్షిణాదిని కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వ్యూహకర్త సునీల్ కనుగోలుయే కారణం.  ఆయన రచించిన వ్యూహాలతోనే హస్తం పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో గెలిచింది.  ఇదే ఉత్సాహంతో జనరల్ ఎలక్షన్స్ లోనూ సునీల్ వాడుకోవాలని ముందుగా అనుకుంది కాంగ్రెస్.  కానీ సుదర్ఘ లక్ష్యాన్ని ఆలోచించి... ప్రస్తుతానికి ఆయన వ్యూహాలను హర్యానా, మహారాష్ట్రలో ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది కాంగ్రెస్ అధిష్టానం. 

  • Written By:
  • Updated On - January 13, 2024 / 05:14 PM IST

దక్షిణాదిని కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) అధికారంలోకి రావడానికి వ్యూహకర్త సునీల్ కనుగోలుయే కారణం.  ఆయన రచించిన వ్యూహాలతోనే హస్తం పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో గెలిచింది.  ఇదే ఉత్సాహంతో జనరల్ ఎలక్షన్స్ లోనూ సునీల్ వాడుకోవాలని ముందుగా అనుకుంది కాంగ్రెస్.  కానీ సుదర్ఘ లక్ష్యాన్ని ఆలోచించి… ప్రస్తుతానికి ఆయన వ్యూహాలను హర్యానా, మహారాష్ట్రలో (Haryana, Maharashtra) ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది కాంగ్రెస్ అధిష్టానం.

2022 వరకూ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాననీ… తనకు పార్టీలో ఉన్నత పదవి కావాలని షరతు పెట్టారు.  అందుకు హస్తం పార్టీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో పీకే సేవలు కాంగ్రెస్ కి దూరం అయ్యాయి.  ఆ తర్వాత ఈ బాధ్యతలను చేపట్టిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు… కర్ణాటకలో ఊహించని విధంగా కాంగ్రెస్ కు విజయం సాధించిపెట్టారు.  అదే మూడ్ లో తెలంగాణను కూడా కాంగ్రెస్ కి టర్న్ చేశారు.  ఇంక సునీల్ సేవలను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందని భావించారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం సునీల్ కనుగోలు సేవలను రాష్ట్రాలకే పరిమితం చేయాలని అనుకుంటోంది.

చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ పట్టుకోల్పోతోంది. కొన్ని చోట్ల బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే… మరికొన్నిచోట్ల ప్రాంతీయ పార్టీలు హస్తం పార్టీ ఉనికి లేకుండా చేశాయి. రాష్ట్రాల్లో తిరిగి పుంజుకోవాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన. అందుకే వ్యూహకర్త సునీల్ కనుగోలును…. ప్రస్తుతానికి లోక్ సభ ఎన్నికలకు వాడుకోవడం లేదు. ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం … హరియానా, మహారాష్ట్ర ఎన్నికల బాధ్యతలను ఆయన టీమ్ ఇప్పటికే చేపట్టింది. గత ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.  మిగతా రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో ఓడిపోయింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో సునీల్ కనుగోలు డిమాండ్లకు… కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్ ఒప్పుకోలేదు. అందుకే కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిన్నదని హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చింది.

దేశంలో బీజేపీ 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కాంగ్రెస్ చేతిలో మూడు మాత్రమే ఉన్నాయి.  అందుకే ఈ ఏడాది జరిగే రాష్ట్రాల అసెంబ్లీ  ఎన్నికల్లో సునీల్ కనుగోలు సేవలు వాడుకొని గట్టెక్కాలన్నది కాంగ్రెస్ ప్లాన్.  రాష్ట్రాల వారీగా బలపడితే… కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఈజీ అవుతుందని హస్తం పార్టీ భావిస్తోంది. అయితే ఇండియా కూటమిలోని చాలా పార్టీలు సునీల్ కనుగోలు సేవలను వాడుకోవాలని చూస్తున్నాయి.  ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం చేసినా… లోక్ సభ ఎలక్షన్స్ కి కూడా ఇండియా కూటమి తరపున సునీల్ పనిచేసే అవకాశాలు లేకపోలేదు.