Telangana 2024-25 financial budget : తెలంగాణ 2024-25 శాఖల వారిగా ఆర్థిక బడ్జెట్.. ఏ శాఖ కు ఎంతో తెలుసా..?

తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.

తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటు రూ.32,557 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 5944 కోట్లు. తెలంగాణ మంత్రుత్వ శాఖ వారిగా తెలంగాణ 2024-25 ఆర్థిక బర్జెట్. తెలంగాణ రాష్ట్ర 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బడ్జెట్ 2,75,891కోట్లు.

శాఖల వారిగా ఆర్థిక బడ్జెట్..

  • ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా.
  • పరిశ్రమల శాఖ 2543 కోట్లు.
  • ఐటి శాఖకు 774కోట్లు.
  • పంచాయతీ రాజ్ 40,080 కోట్లు.
  • పురపాలక శాఖకు 11692 కోట్లు.
  • మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు.
  • వ్యవసాయ శాఖ 19746 కోట్లు.
  • ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250 కోట్లు.
  • ఎస్సి సంక్షేమం 21874 కోట్లు.
  • ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు.
  • మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు.
  • బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
  • బీసీ సంక్షేమం 8 వేల కోట్లు.
  • విద్యా రంగానికి 21389 కోట్లు.
  • తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
  • యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు.
  • వైద్య రంగానికి 11500 కోట్లు.
  • విద్యుత్ – గృహ జ్యోతికి 2418 కోట్లు.
  • విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
  • గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
  • నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు.