TELANGANA: అన్నంత పనీ చేశారు.. ఆ మేడంని సాగనంపారు

కొన్ని ఏళ్లుగా కూకట్‌పల్లి జోన్ పరిధిలో పాతుకుపోయిన ఈ లేడీ ఆఫీసర్‌.. టీజీవో సంఘాన్ని చెప్పుచేతల్లో పెట్టుకున్నారనే విమర్శ ఉంది. బీఆర్‌ఎస్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అండదండలతో టీజీవో సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 08:23 PM IST

TELANGANA: మమత! ఆఫీసర్లలో ఆమె రూటే సెపరేటు! ఆమె మాటే వేదం! ఆమె మాటే శాసనం! మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కి అత్యంత సన్నిహితురాలు. ఉద్యోగ సంఘాలను అడ్డం పెట్టి పదేళ్లు చక్రం తిప్పింది. అయితే ఇదంతా గతం! ఇప్పుడు సర్కారు మారింది! రూల్ మారింది! ఆమె ప్లేస్ కూడా మారింది! మేడం గురించి అన్నీ తెలుసని సీఎం కాకముందే రేవంత్ అన్నారు.. అన్నట్టే మార్చారు. కూకట్​పల్లి జోనల్ కమిషనర్ మమత. ఈ పేరు తెలియనివారు లేరు. ట్రాన్స్‌ఫర్‌ చేస్తే సాయంత్రానికల్లా అనుకున్న చోటికి మార్పించుకున్న ఆఫీసర్.

REVANTH REDDY: 6 వద్దు 9 ముద్దు.. 6ను నమ్ముకుని కేసీఆర్ మునిగిపోయాడు.. నేను 9లో ఉంటా..

గత సర్కారులో తన పలుకుబడి, పరపతి అలా ఉండేది. కొన్ని ఏళ్లుగా కూకట్‌పల్లి జోన్ పరిధిలో పాతుకుపోయిన ఈ లేడీ ఆఫీసర్‌.. టీజీవో సంఘాన్ని చెప్పుచేతల్లో పెట్టుకున్నారనే విమర్శ ఉంది. బీఆర్‌ఎస్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అండదండలతో టీజీవో సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సీఎం కాకముందు రేవంత్ రెడ్డి ఇదే అంశంపై మాట్లాడారు. అనుకున్నట్టే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెపై బదిలీ వేటు వేశారు. ​మమతను నేషనల్​ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్​మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. చాలా రోజులుగా కూకట్ పల్లి జోన్‌లోనే పాతుకు పోయిన మమతపై చాలా ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. గత సర్కారులో తన పలుకుబడిని ఉపయోగించి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని విమర్శలున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మమతపై వేటు పడుతుందని అందరూ భావించారు.

ముఖ్యమంత్రిగా రేవంత్​రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకు జోనల్ కమిషనర్ ​మమత టీజీఓ సంఘం తరఫున రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆమెను అంత త్వరగా బదిలీ చేయకపోవచ్చని అందరు భావించారు. కానీ, ఆమె టైం రానే వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో జోనల్ కమిషనర్లను బదిలే చేసే క్రమంలో మమతకు మార్చేశారు. నేషనల్ ​ఇన్‌స్టిట్యూట్ ​ఆఫ్​ అర్బన్ ​మేనేజ్​మెంట్ డైరెక్టర్‌గా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. మమత స్థానంలో ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్‌ను కూకట్​పల్లి జోనల్​ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.