ఆవిర్భావ దినోత్సవం (Telangana Independence Day) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని (State symbol of Telangana) ఆవిష్కరించేందుకు.. కాంగ్రెస్ సర్కార్ (Congress Party,) రెడీ అవుతోంది. రాజముద్రకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కాంగ్రెస్ అనుకూల ఛానల్ అని పేరు ఉన్న.. న్యూస్ ఛానల్ నుంచి ఆ ఫోటో బయటకు రావడంతో.. ఆ లోగోనే ఫైనల్ అని దాదాపు అందరు ఫిక్స్ అయ్యారు… లోగోలు అమరుల స్థూపం, వరి కంకులు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో రాసి ఉంది. మూడు సింహాల గుర్తును లోగోకు జత చేశారు. గత రాజముద్రలో ఉన్న కాకతీయ కళా తోరణం, చార్మినార్ చిత్రాలను తొలగించారు. ఇక రాజముద్ర రంగు కూడా మారిపోయింది. గతంలో తెలంగాణ రాష్ట్ర చిహ్నం తెలుపు రంగు బ్యాక్ గ్రౌండ్‌లో ఆకుపచ్చ రంగులో ఉండగా.. కొత్త లోగోలో ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులు ఉన్నాయి.
ఇదే ఇప్పుడు కొత్త రచ్చకు కారణం అవుతోంది. మూడు రంగుల జెండా లా ఉండడంతో.. అది కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ గుర్తు చేసేలా ఉంది అంటూ.. కొందరు సోషల్ మీడియాలో చర్చ మొదలు పెట్టారు.. అయితే ఇదే ఫైనల్ అని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ గుర్తును ప్రభుత్వం అధికారంగా ప్రకటించాల్సి ఉంది.