Arjun Reddy – KTR : అర్జున్‌రెడ్డిలా మారిన కేటీఆర్‌..

కేటీఆర్ అనగానే ఏం గుర్తొస్తుంది.. క్లీన్‌షేవ్‌, ఫార్మల్ డ్రెస్సింగ్‌.. ఇదే కదా ! ఐతే ఇప్పుడు ఆయన లుక్ మార్చేశారు. ఇన్ని రోజులు నీట్ షేవ్‌తో సాఫ్ట్‌గా కనిపించిన కేటీఆర్.. జుట్టు, గడ్డం పెంచేసి మాస్ సినిమాల్లో హీరోల్లా.. రఫ్ లుక్‌లో కనిపించారు. ఇంకా చెప్పాలంటే.. అర్జున్‌ రెడ్డి అనిపిచారు. లాంగ్ హెయిర్, గడ్డంతో ఉన్న ఫొటోనూ.. కేటీఆరే స్వయంగా ట్వీట్ చేశారు.

కేటీఆర్(KTR) అనగానే ఏం గుర్తొస్తుంది.. క్లీన్‌షేవ్‌, ఫార్మల్ డ్రెస్సింగ్‌.. ఇదే కదా ! ఐతే ఇప్పుడు ఆయన లుక్ మార్చేశారు. ఇన్ని రోజులు నీట్ షేవ్‌తో సాఫ్ట్‌గా కనిపించిన కేటీఆర్.. జుట్టు, గడ్డం పెంచేసి మాస్ సినిమాల్లో హీరోల్లా.. రఫ్ లుక్‌లో కనిపించారు. ఇంకా చెప్పాలంటే.. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) అనిపిచారు. లాంగ్ హెయిర్, గడ్డంతో ఉన్న ఫొటోనూ.. కేటీఆరే స్వయంగా ట్వీట్ చేశారు. నిన్నటివరకు ఫార్మల్ లుక్‌లో కనిపించిన కేటీఆర్.. ఒక్కసారిగా అలా ఎలా అయిపోయారని తెగ డౌట్ పడిపోయారు అందరూ. ఐతే అసలు విషయం వేరే ఉంది. ఇది ఒరిజినల్ గెటప్ కాదు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ వీరాభిమాని.. కేటీఆర్‌ లుక్‌ను మార్చేసిన ఓ ఫొటోను ఆయనకే పంపించాడట.

ఈ ఫొటోలో.. కేటీఆర్‌కు పొడవాటి జట్టును, గడ్డంను కూడా పెట్టి.. మాస్ లుక్‌ వచ్చేలా ఎడిట్ చేశాడు. ఈ ఫొటోను చూసిన కేటీఆర్.. బాగా నచ్చటంతో దాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని అమితంగా అభిమానించే ఓ వీరాభిమాని ఎడిట్‌ చేసి పంపిన ఫొటోను.. మీకోసం ట్వీట్ చేస్తున్నానని రాసుకొచ్చాడు. ఒకవేళ జుట్టు, గడ్డం పెంచుకుంటే అచ్చం ఇలా ఉంటానన్నమాట అంటూ సరదా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు కేటీఆర్. ఈ ఫొటోలో కేటీఆర్ ఓ మాస్ హీరోలా కనిపిస్తుండటంతో.. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కేటీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు. ఐతే అభిమాని ఎడిట్‌ చేసిన ఈ ఫొటోలో కేటీఆర్‌ లుక్‌ అదిరిపోయింది. ఆ ఫొటో కింద కేటీఆర్ అని ఇంగ్లీష్‌లో పెద్ద పెద్ద అక్షరాలతో పాటు.. ది కమ్‌ బ్యాక్‌ ఈజ్‌ ఆల్వేస్‌ స్ట్రాంగర్‌ దేన్‌ ది సెట్‌ బ్యాక్ అనే కొటేషన్‌ను రాసుకొచ్చాడు. మరోవైపు.. ఈ ఫొటోపై పింక్ ఆంట్స్ టీం యూఎస్ఏ అన్న లోగో కనిపిస్తోంది. దీన్ని బట్టి.. ఈ ఫొటోను ఎడిట్ చేసిన ఆ అభిమాని ఎన్నారై అని తెలుస్తోంది.