Babu Mohan : బాబుమోహన్‌కు ఆ పదవి.. కేఏ పాల్ కీలక నిర్ణయం..

ఈ మధ్యే బీజేపీ (BJP) కి బైబై చెప్పిన బాబుమోహన్ (Babu Mohan).. షాకింగ్‌గా కేఏ పాల్ (KA Paul) పార్టీలో చేరారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన బాబుమోహన్‌.. చివరికి పాల్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో మొదలైన చర్చ అంతా ఇంతా కాదు. ఇదంతా ఎలా ఉన్నా.. బాబూమోహన్‌కు కేఏ పాల్‌ కీలక పదవి ఇచ్చారు.

ఈ మధ్యే బీజేపీ (BJP) కి బైబై చెప్పిన బాబుమోహన్ (Babu Mohan).. షాకింగ్‌గా కేఏ పాల్ (KA Paul) పార్టీలో చేరారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన బాబుమోహన్‌.. చివరికి పాల్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిదంటూ సోషల్‌ మీడియాలో మొదలైన చర్చ అంతా ఇంతా కాదు. ఇదంతా ఎలా ఉన్నా.. బాబూమోహన్‌కు కేఏ పాల్‌ కీలక పదవి ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రజాశాంతి పోటీ చేస్తుందని పాల్ తెలిపారు. తాను ఈసారి తెలంగాణలో పోటీ చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ తొలి ఎంపీ అభ్యర్థిగా బాబూమోహన్‌ను ప్రకటించారు.

వరంగల్ (Warangal) నుంచి ప్రజాశాంతి పార్టీ (Prajashanti Party) అభ్యర్థిగా బాబుమోహన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండబోతున్నారు. ఇప్పుడు తన దృష్టి అంతా ఏపీ మీదే అని పాల్ అంటున్నారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కూటమికి, వైసీపీకి గట్టి షాక్ ఇస్తానని ధీమాగా చెప్తున్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే.. విదేశాల నుంచి నిధులు తీసుకొచ్చి ఏపీని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు.

చంద్రబాబు, జగన్‌.. చెరో ఐదేళ్లు పాలించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా.. రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని ఫైర్ అయ్యారు. ఏపీలో పాల్ రావాలి.. పాలన మారాలంటూ స్లోగన్ అందుకుంటున్నారు. ఎన్నికలు వస్తే చాలు హల్చల్ చేసే పాల్‌.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేసిన పాల్ కు డిపాజిట్ దక్కలేదు. ఎన్నికల్లో ఓటమి చెందినా.. ప్రచారాల్లో మాత్రం దూసుకెళ్లి అందరిని ఆకర్షించారు.