భారత రాజ్యాంగాన్ని (Constitution of India) కాపాడుకుందామంటూ సచివాలయం పరిధిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల 4న (రేపు) “ ఛలో నెక్లెస్‌రోడ్ ” (Chloe Necklace Road) పేరిట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మే 4న నిర్వహించే ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పార్టీ నేతలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్, జేఏసి ఛైర్మన్ గజ్జల కాంతం, మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ మాదిగ , కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్సీ తదితరులను సిఎం రేవంత్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి పిలిపించుకుని ఈ సందర్భంగా చర్చలు జరిపారు. ఈ నెల 4వ తేదీన నిర్వహించే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా సిఎం రేవంత్ వారిని కోరారు.
SSM