Vc Sajjanar: బస్సుల్లో 12 కోట్ల మహిళల ఉచిత ప్రయాణం.. అవసరమైతే వారి కోసం ప్రత్యేక బస్సులు..

ప్రతీ రోజూ సగటున 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వినియోగించుకుంటున్నారని సజ్జనార్ వెల్లడించారు. అయితే, ఉచిత బస్సు ప్రయాణం వల్ల పురుషులు, దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందుల ఎదురవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 06:59 PM IST

Vc Sajjanar: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టిన 45 రోజుల్లోనే మహిళలు 12 కోట్ల వరకు ప్రయాణాలు చేశారు. అంటే.. టిక్కెట్ లేకుండా ప్రయాణించిన మహిళల సంఖ్య 12 కోట్లు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణలో మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయమని సజ్జనార్ అన్నారు.

India vs England: తొలి టెస్టులో భారత్ ఓటమి.. లక్ష్య చేధనలో వెనుకబడ్డ టీమిండియా

ప్రతీ రోజూ సగటున 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వినియోగించుకుంటున్నారని సజ్జనార్ వెల్లడించారు. అయితే, ఉచిత బస్సు ప్రయాణం వల్ల పురుషులు, దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందుల ఎదురవుతున్నాయి. ఈ విషయంపైనా సజ్జనార్ స్పందించారు. దివ్యాంగులకు కేటాయిచిన సీట్లలో కూడా మహిళలు కూర్చుకుంటున్న విషయం తమ తన దృష్టికి వచ్చిందన్నారు. దీనికి త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. అందుకే త్వరలో 2,375 కొత్త బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. బస్సుల సంఖ్య పెరగడం వల్ల సీట్లు లభించి, దివ్యాంగులు, వృద్ధులకు మేలు జరుగుతుందన్నారు. ఒకవేళ అవసరమైతే దివ్యాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని, కొన్ని విభాగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తామని సజ్జనార్‌ చెప్పారు.

కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్ చేపడతామన్నారు. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఆర్టీసీ కానిస్టేబుళ్లకు కూడా శిక్షణ ఇస్తున్నట్లు, త్వరలోనే వాళ్లంతా విధుల్లో చేరనున్నట్లు సజ్జనార్ చెప్పారు.