TSRTC: ఇకపై ఆ కార్డు చెల్లదు.. ఉచిత బస్సులపై సజ్జనార్ కీలక ప్రకటన

ఉచిత బస్సు ప్రయాణాన్ని యూజ్ చేసుకునేందుకు.. మహిళలు తమ వెంట ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ను తీసుకురావాలని అధికారులు సూచించారు. ఐతే ఇప్పుడు ఇదే విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్‌ వేదికగా కొన్ని విషయాలు పంచుకున్నారు. 

  • Written By:
  • Updated On - January 8, 2024 / 06:58 PM IST

TSRTC: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌.. ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలకు ఎక్స్‌ప్రెస్‌తో పాటు పల్లెవెలుగు, సిటీ బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేసే సౌకర్యం కల్పించారు. ఈ పథకానికి మహిళల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. వర్కింగ్ ఉమెన్‌తో పాటు విద్యార్థినులకు ఈ స్కీమ్‌ ఎంతో ఉపయోగపడుతోంది.

REVANTH VS NANI: కొడాలి నానిని రానీయొద్దు! నో ఎంట్రీ అంటున్న రేవంత్..

ఉచిత బస్సు ప్రయాణాన్ని యూజ్ చేసుకునేందుకు.. మహిళలు తమ వెంట ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ను తీసుకురావాలని అధికారులు సూచించారు. ఐతే ఇప్పుడు ఇదే విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్‌ వేదికగా కొన్ని విషయాలు పంచుకున్నారు.  ఉచిత బస్సుకు ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అంటూ ట్వీట్‌ చేశారు. ఫ్రీ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలంటే.. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి అని.. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డు అయినా ఈ స్కీమ్‌కు వర్తిస్తుందని తెలిపారు. ఐతే పాన్‌ కార్డు మాత్రం.. చెల్లదని చెప్పేశారు. పాన్‌ కార్డులో అడ్రస్ ఉండదని.. అందుకే అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని.. క్లారిటీ ఇచ్చారు. పాన్ కార్డుతో ఎవరు బస్సు ఎక్కినా.. చార్జి చెల్లించాల్సి వస్తుందని చెప్పారు.

ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని పదేపదే చెప్తున్నా.. ఇప్పటికి కొంతమంది స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్‌లు చూపిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. సిబ్బంది ఇబ్బంది పడుతుండడంతో పాటు.. ప్రయాణ సమయం పెరుగుతోంది. దీంతో ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ ను తీసుకోవాలని కోరుతున్నామని సజ్జనార్ తెలిపారు.