BRS TO Congress : కాంగ్రెస్‌లోకి మరో ఇద్దరు బీఆర్‌ఎస్‌ నేతలు..

బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి ఎదురుదెబ్బ తగిలే సంకేతాలు స్పంష్టంగా కనిపించడంతో ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే పలు కీలక నేతలు కాంగ్రెస్‌, బీజేపీలో జాయిన్‌ అవ్వగా.. ఇప్పుడు మరో ఇద్దరు కీలక నేతలు కూడా పార్టీ మారేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి ఎదురుదెబ్బ తగిలే సంకేతాలు స్పంష్టంగా కనిపించడంతో ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే పలు కీలక నేతలు కాంగ్రెస్‌, బీజేపీలో జాయిన్‌ అవ్వగా.. ఇప్పుడు మరో ఇద్దరు కీలక నేతలు కూడా పార్టీ మారేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి (Payla Shekhar Reddy) , మండలి చైర్మెన్‌ కొడుకు గుత్తా అమిత్‌ కాంగ్రెస్‌లో జాయిన్‌ అయ్యేందుకు రెడీ అయినట్టు టాక్‌. బీఆర్ఎస్‌ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు గుత్తా కొడుకు అమిత్‌ రీసెంట్‌గా ప్రయత్నించారు. కానీ అమిత్‌ టికెట్‌ విషయంలో పార్టీ నుంచి స్పష్టమైన క్లారిటీ రాలేదు.

దీంతో అమిత్‌ పార్టీ మారేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు (Congress) చెందని కీలక నేతలతో అమిత్‌ చర్చించినట్టు టాక్‌. మరోపక్క శేఖర్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. చర్చలు ఫలిస్తే త్వరలోనే వీళ్లద్దరూ కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, మహబూబాబాద్‌ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ (MP Sitaram Naik) నిన్న బీజేపీలో చేరారు. దీంతో రోజు రోజుకూ కారు పార్టీ ఖాలీ అవుతోంది.

దీనికి తోడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారాయి. పార్లమెంట్‌ ఎన్నికల తరువాత బీఆర్ఎస్‌ ఖాళీ అవుతుందని కోమటిరెడ్డి రీసెంట్‌గా ఓ మీటింగ్‌లో చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే బీఆర్‌ఎస్‌ నేతలంగా వరుసగా కాంగ్రెస్‌ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మరో ఇద్దరు నేతలు కూడా కారు దిగేందుకు రెడీ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.