కవిత బెయిల్ ఆర్డర్ లో ఏముంది…?

  • Written By:
  • Publish Date - August 27, 2024 / 01:45 PM IST

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కాసేపటి క్రితం ఆమెకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్ట్… పలు కీలక అంశాలను ప్రస్తావించింది. కవితకు షరతులతో కూడిన బెయిల్ ను సిబిఐ, ఈడీ కేసుల్లో మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్ లో సుప్రీం కోర్ట్ ప్రస్తావించిన విషయాలు ఒకసారి పరిశీలిస్తే పాస్ పోర్ట్ సబ్మిట్ చేయాలి అని స్పష్టం చేసింది.

దేశం విడిచి పోవాలి అంటె పర్మిషన్ తీసుకుని వెళ్లాలి అని పేర్కొంది. కేసు ట్రయల్ కు సహకరించాలి అని స్పష్టం చేసింది. విచారణ వాయిదాల సమయం లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి సహకరించాలని ఆదేశించింది. నేడు సాయంత్రం కవిత జైలు నుంచి విడుదల కానున్నారు. పది లక్షలు విలువ చేసే రెండు హామీలను సమర్పించాలని కోర్ట్ పేర్కొంది. కాగా మార్చ్ 15 నుంచి కవిత తీహార్ జైలు లో ఉన్నారు.