భువనేశ్వరి, చిరంజీవి, పవన్‌ను తిడితే ఏమయ్యారు ? నాగార్జున, సమంతపై మాత్రం ప్రేమ పుట్టుకొచ్చిందా ?

దేశవ్యాప్తంగా కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం సమంత, నాగార్జునకు మద్దతుగా సినీ తారలు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు వరుసగా ట్వీట్లు చేస్తున్న అగ్రతారలు భువనేశ్వరి నిందించినపుడు ఏమయ్యారు ?

  • Written By:
  • Publish Date - October 4, 2024 / 06:36 PM IST

దేశవ్యాప్తంగా కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం
సమంత, నాగార్జునకు మద్దతుగా సినీ తారలు
కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు
వరుసగా ట్వీట్లు చేస్తున్న అగ్రతారలు
భువనేశ్వరి నిందించినపుడు ఏమయ్యారు ?
పవన్‌కల్యాణ్‌ అంతలా తిట్టినా ఎందుకు స్పందించలేదు ?
చిరంజీవిని వైసీపీ టార్గెట్‌ చేసినపుడు కోమాలో ఉన్నారా ?

తెలంగాణలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొట్టకుండా ఉండాలంటే…సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్‌ ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంతను పావుగా వాడుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా…జుగుప్సకరంగా అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్యను చిత్రీకరించారు. కొండా సురేఖ వర్సెస్‌ కేటీఆర్‌ వార్‌లోకి…అనవసరంగా అక్కినేని ఫ్యామిలీని, సమంతను మధ్యలోకి లాగారు. కొండా-కేటీఆర్‌ కుటుంబాలకు ఉన్న వ్యక్తిగత, రాజకీయ వైరంలోకి సినిమా రంగాన్ని లాగారు. ఏ మహిళ మాట్లాడని విధంగా కామెంట్స్‌ చేశారు. సమంతతో పాటు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను వివాదంలోకి లాగారు. దీంతో సినిమా రంగం మొత్తం నాగార్జున బాసటగా నిలిచింది. చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాష్‌, రాంచరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌, నానితో పాటు పలువురు హీరోయిన్లు కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు.

కొండా సురేఖ, సమంత వ్యవహారంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారంతా…వరుసగా ఖండిస్తూనే ఉన్నారు. మీ రాజకీయాలకు తమను ఎందుకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. కొండా సురేఖ కామెంట్స్‌ రచ్చ ఏఐసీసీ దాకా పోయింది. అక్కినేని అమల…కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఫిర్యాదు చేశారు. అక్కినేని ఫ్యామిలీ, సమంత వ్యవహారంలో స్పందిస్తున్న సినీతారలు…
మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించినా పట్టించుకోలేదు. ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌…మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని…నిత్య పెళ్లికొడుకు అంటూ రోజా, పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేశ్‌ వంటి నేతలు పర్సనల్‌గా అటాక్‌ చేశారు. చోటా మోటా నాయకులు కూడా పవన్‌ కల్యాణ్‌ను నోటితో ఉచ్చరించలేని విధంగా దుర్బాషలాడారు. డిప్యూటీ సీఎం పిల్లలను వైసీపీ నేతలు…నోటికొచ్చినట్లు మాట్లాడారు. వాడు…వీడు…ఓరేయ్…అంటూ కట్టకట్టుకొని నేతలంతా వరుస పెట్టి తిట్టారు. సోషల్ మీడియాలో పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిత్వాన్ని ట్రోలింగ్‌ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం…ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు మద్దతుగా నిలవలేదు. అప్పట్లో మంత్రులు, మాజీ మంత్రులు చేసిన వల్గర్‌ లాంగ్వేజ్‌ను ఖండించలేదు. జబర్దస్త్ ఆర్టిస్టులే ఆయనకు బాసటగా నిలిచారు.

చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరిపై అంబటి రాంబాబు, వల్లభనేని వంశీమోహన్‌…పరుష పదజాలం ప్రయోగించారు. నారా లోకేశ్‌ పుట్టుకను ప్రశ్నించారు. భువనేశ్వరి…దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డితో ఎఫైర్‌ నడిపారంటూ బహిరంగంగానే నీతిమాలిన కామెంట్స్ చేశారు. ఆ సమయంలో కూడా చంద్రబాబునాయుడుకు…భువనేశ్వరికి…తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మద్దతే కరువైంది. పవన్ కల్యాణ్‌ తప్పా….ఎవరు ఈ విషయంలో ఘాటుగా స్పందించలేదు. సమంత, నాగార్జున విషయంలో ట్వీట్లు చేస్తున్న హీరోలంతా…తేలుకుట్టిన బల్లిలా వ్యవహరించారు. ముఖ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అయితే…మరీ టూమచ్‌గా స్పందించాడు. ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ…పాము చావకుండా…కర్ర విరగకుండా ఉండేట్లు ట్వీట్‌ చేశాడు. మేనత్తను వైసీపీ నేతలు అన్నన్ని మాటలు అంటున్నా…తనకేమీ తెలియనంటూ తనలోని నటనా కౌశలాన్ని ప్రదర్శించాడు. దొంగ పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు…ఒక ట్వీట్ చేసి మమ అనిపించాడు.

సమంత, నాగార్జున కోసం ఇంతలా రంకెలు వేస్తున్న సిని రంగ ప్రముఖుల నోర్లు ఆప్పుడేమయ్యాయి. ఒక్కరంటే ఒక్కరైనా భువనేశ్వరికి మద్దతుగా నిలిచారా ? వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారా ? మీ వ్యక్తిగత రాజకీయాల కోసం కుటుంబసభ్యులను ఎందుకు లాగుతారని ప్రశ్నించారా ? అంటే నో ఆన్సర్. ప్రస్తుతం కొండా సురేఖపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న హీరోలంతా ఎందుకు ఇంతలా స్పందిస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. నాగార్జున ఒత్తిడితో ట్వీట్లు చేస్తున్నారా ? లేదంటే బీఆర్ఎస్‌ నేతల ఒత్తిడితో చేస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచనతో… ఫ్యూచర్‌లో రిలీజ్‌ అయ్యే సినిమాలకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకే కామెంట్లు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు సినిమాలకు సంబంధం లేదంటున్న హీరోలు…ఒక్కోక్కరి ఒక్కోలా వ్యవహరించడంపై జనం కూడా చీత్కరించుకుంటున్నారు. ఓవర్‌గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారని ప్రశ్నిస్తున్నారు.