న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లను కొందరు వ్యక్తులు చుట్టుముట్టి చేసిన అల్లరి ఇది. ఇది ఎక్కడో బంగ్లాదేశ్‌లోనో పాకిస్థాన్‌లోనో జరిగిన ఇన్సిడెంట్ కాదు. మన తెలంగాణలో.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో జరిగింది. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరుగుతోందో రెండు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. వందశాతం రుణమాఫీ చేశారని నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ ధర్నాలు ఉద్రిక్తంగా కూడా మారాయి. ఇదే క్రమంలో అసలు నిజంగా రుణమాఫీ వందశాతం జరిగిందా లేదా అని ప్రజల నుంచి సమాచారం తీసుకునేందుకు వెళ్లడమే ఈ ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లు చేసిన తప్పు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కూడా కాదు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో. కొండారెడ్డిపల్లి గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందా అని స్థానిక రైతుల నుంచి పబ్లిక్ టాక్ తీసుకుంటున్న సమయంలో ఇలా కొందరు వ్యక్తులు ఈ ఇద్దరు మహిళా జర్నిలిస్టులను చుట్టుముట్టారు. ఆడవాళ్లు అని కూడా చూడకుండా వాళ్ల కెమెరాలు మైక్‌లు లాక్కొని అసభ్యంగా ప్రవర్తించారు. చుట్టూ ఉన్నవాళ్లు వీడియో తీస్తున్నారు అనే భయం కూడా లేకుండా ఇద్దరు ఆడబిడ్డలను ఇబ్బది పెట్టారు. ఎందుకు రైతులను రుణమాఫీ గురించి ప్రశ్నిస్తున్నారు అంటూ భయబ్రాంతులకు గురి చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మహిళా జర్నలిస్ట్‌లను ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తులు.. గతంలో సీఎం రేవంత్ రెడ్డితో దిగిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో.. ఇదేనా మీ ప్రజా పాలన అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ మీ జాగీరు కాదంటూ గుర్తు చేస్తున్నారు. మీరు ఏ పార్టీ వాళ్లైనా కావొచ్చు. కానీ చేసే పోరాటం పడే ఆరాటం సిద్ధాంత పరంగా ఉండాలే తప్ప ఇలా వ్యక్తిగత దాడులు కరెక్ట్ కాదు.. అదీ ఇద్దరు మహిళా జర్నిలిస్ట్‌ల మీద ఇలాంటి చర్య అత్యంత హేయం. రైతులు ఏది చెప్పారో అదే వాళ్లు టెలికాస్ట్ చేస్తారు. తప్పుగా మీపై వార్తలు రాసే ప్రయత్నం చేస్తే కోర్టులు ఉన్నాయి.. పోలీస్ స్టేషన్‌లూ ఉన్నాయి. ఏ సంస్థలో వాళ్ల పని చేస్తున్నారో ఆ సంస్థ యాజమాన్యాలపై కేసులు పెట్టి లీగల్‌గా పోరాడే హక్కు మీకుంది అవకాశం కూడా మీకుంది. అంతే కానీ నిస్సహాయంగా ఉన్న ఇద్దరు మహిళలను చుట్టుముట్టి మీరు చేసిన ఈ అరాచకం రాబోయే రోజుల్లో మీ ఖర్మను నిర్ణయిస్తుంది అంటున్నారు ఈ వీడియో చూసినవాళ్లు. కలకత్తా డాక్టర్ అత్యాచర ఘటనతో దేశం మొత్తం ఆందోళనలతో రగిలిపోతోంది. మహిళల రక్షణ కోసం ప్రతీ ఒక్కరూ ఆరాటపడుతున్న ఇలాంటి సిచ్యువేషన్‌లో తెలంగాణ లాంటి శాంతియుత రాష్ట్రంలో పట్టపగలు మహిళా జర్నలిస్టుల మీద జరిగిన ఈ దుశ్చర్య మీ ప్రజాపాలనను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.