DH Srinivas : మొన్న బీఆర్ఎస్…ఇప్పుడు కాంగ్రెస్ ఎవరికైనా చూపించడ్రా బాబు

గడల శ్రీనివాస్ ... ఈ పేరు వింటే... ఎక్కడో విన్నట్టు ఉంది అనుకుంటారు. కానీ మాజీ డీహెచ్ శ్రీనివాస్... కేసీఆర్ కు వంగి వంగి దండాలు పెట్టారు కదా... అంటే అందరూ గుర్తుపట్టేస్తారు.

 

 

 

గడల శ్రీనివాస్ … ఈ పేరు వింటే… ఎక్కడో విన్నట్టు ఉంది అనుకుంటారు. కానీ మాజీ డీహెచ్ శ్రీనివాస్… కేసీఆర్ కు వంగి వంగి దండాలు పెట్టారు కదా… అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేషాలో… కొత్తగూడెం అసెంబ్లీ సీటు కోసం తెగ ప్రయత్నం చేశాడు మాజీ డీహెచ్ శ్రీనివాస్(Former DH Srinivas). ఆ ఏరియాలో కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. కేసీఆర్ ను ఇంద్రుడు… చంద్రుడు రేంజ్ లో తెగ పొగిడారు. ప్రభుత్వ పదవిలో ఉండి… బీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడటంతో ఆయన ప్రతిపక్ష పార్టీలకు టార్గెట్ అయ్యారు.

కేసీఆర్ ప్రభుత్వ (KCR Government) మీటింగ్స్… కార్యకర్తల సమావేశాలు… ఏవైనా జరగనీయండి… కేసీఆర్ కనిపిస్తే చాలు… అమాంతం కాళ్ళ మీద పడిపోయేవారు మాజీ డీహెచ్ శ్రీనివాస్.. తాను ఓ బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి పోస్టులో ఉన్నాను అన్నడి కూడా ఆయనకు గుర్తుండేది కాదు. స్వామిభక్తి ఎక్కువ కాబట్టే… 2018లో DHగా నియమితులైన శ్రీనివాస్… బీఆర్ఎస్ అధికారం కోల్పోయే దాకా అదే పదవిలో కొనసాగారు. అప్పట్లో ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. కోవిడ్ టైమ్ లోనూ డ్యూటీ సరిగా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే DH పదవిలో ఉండగా… కొత్తగూడెం అసెంబ్లీ బీఆర్ఎస్ టిక్కెట్ కోసం తెగ ప్రయత్నం చేశారు గడాల శ్రీనివాస్.

ఆయన ఎన్నిసార్లు దండాలు పెట్టినా… కేసీఆర్ మాత్రం కరుణించలేదు. కొత్తగూడెం సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే తిరిగి కేటాయించారు కేసీఆర్. ఆ తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే… డీహెచ్ పదవి నుంచి శ్రీనివాస్ ను తొలగించారు. దాంతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళారు శ్రీనివాస్. BRS హయాంలో ఆయనపై అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఆ ఫైళ్ళను సీఎం రేవంత్ రెడ్డి బయటకు తీస్తున్నట్టు సమాచారం. త్వరలో ఏసీబీ దాడులు కూడా జరుగుతాయని తెలుస్తోంది.

దాంతో మొన్నటిదాకా బీఆర్ఎస్ కి అంటకాగిన శ్రీనివాస్… సడన్ గా ప్లేట్ ఫిరాయించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఖమ్మం లేదా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాలని గాంధీభవన్ లో అప్లయ్ చేశారు. ఏసీబీ దాడుల నుంచి తప్పించుకోడానికే శ్రీనివాస్ కాంగ్రెస్ టిక్కెట్ కోసం అప్లయ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. కానీ మొన్నటి దాకా గులాబీ బాస్ కాళ్ళు మొక్కిన ఆయన… ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన చేరాలనుకోవడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.