Russia: భారత్ నుంచి ఆయుధాలు కొంటున్న రష్యా.. యుద్ధం వల్ల ఈక్వేషన్స్ మారిపోయాయా..?

మన దేశం కొనుగోలు చేస్తున్న మిలిటరీ ఎక్విప్‌మెంట్‌లో మెజార్టీ భాగం రష్యా నుంచే వస్తుంది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. గతంలో భారత్‌కు అమ్మిన ఆయుధ సామగ్రిని మళ్లీ తమకు తిరిగి అమ్మాలని రష్యా వేడుకుంటుంది. రష్యా నుంచి భారత్‌కు చేరిన మిలిటరీ కాంపోనెంట్స్‌ను తిరిగి కొనుగోలు చేసేందుకు రష్యా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.

Russia: డామిట్ కథ అడ్డం తిరిగింది..! నిన్న మొన్నటి వరకు భారత్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేసిన రష్యా ఇప్పుడు ఆయుధ సామాగ్రి కావాలంటూ మన దేశం వైపు చూస్తోంది. గతంలో రష్యా భారత్‌కు అమ్మిన ఆయుధాలను తిరిగి కొనుగోలు చేసేందుకు క్రెమ్లిన్ ఆసక్తి చూపిస్తోంది. భారత్ రష్యా మధ్య మిలటరీ సంబంధాలు ఈనాటివి కావు. భారత రక్షణ, యుద్ధ అవసరాలకు కావాల్సిన కీలకమైన ఆయుధ సామాగ్రి మొత్తాన్ని రష్యా నుంచే భారత్ కొనుగోలు చేస్తుంది. మన దేశం కొనుగోలు చేస్తున్న మిలిటరీ ఎక్విప్‌మెంట్‌లో మెజార్టీ భాగం రష్యా నుంచే వస్తుంది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. గతంలో భారత్‌కు అమ్మిన ఆయుధ సామగ్రిని మళ్లీ తమకు తిరిగి అమ్మాలని రష్యా వేడుకుంటుంది. రష్యా నుంచి భారత్‌కు చేరిన మిలిటరీ కాంపోనెంట్స్‌ను తిరిగి కొనుగోలు చేసేందుకు రష్యా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.
అప్పుడు రష్యా అమ్మింది.. మళ్లీ ఇప్పుడు కొంటోంది..ఎందుకు ?
యుద్ధం సృష్టించే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఉక్రెయిన్‌పై దాదాపు 500 రోజలుగా యుద్ధం చేస్తున్న రష్యా.. తనకున్న శక్తియుక్తులన్నింటినీ ప్రయోగిస్తోంది. మిలిటరీ మొత్తాన్ని ఉక్రెయిన్‌పైనే మోహరించింది. ఉక్రెయిన్‌ను దారికి తెచ్చుకునేందుకు తనకున్న ఆయుధ సంపత్తిలో ఎక్కువ భాగాన్ని ఈ యుద్ధం కోసమే కేటాయించింది రష్యా. అయితే సుధీర్ఘకాలంగా యుద్ధం సాగడంతో రష్యా వద్ద ఉన్న ఆయుధాగారం ఖాళీ అయ్యే పరిస్థితి తలెత్తింది. రష్యా సైనికుల చేతికి బలమైన ఆయుధాలను, యుద్ధ ట్యాంకులను, క్షిపణులను అందిస్తే తప్ప.. యుద్ధంపై పట్టు సాధించలేరు. ఎప్పుడైతే ఆయుధాల కొరత వెంటాడుతుందో.. అప్పుడు వార్ ఈక్వేషన్స్ మారిపోతాయి. ఉక్రెయిన్ ముందు రష్యా ఎంత పెద్ద దేశమైనా.. అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోకపోతే ఉక్రెయిన్ చేతిలో చావు దెబ్బ తప్పదు. అందుకే పరిస్థితి పూర్తిగా ప్రతికూలంగా మారకముందే.. రష్యా జాగ్రత్త పడుతోంది. భారత్‌తో రష్యాకు బలమైన మిలిటరీ సంబంధాలు ఉండటంతో మన దేశానికి గతంలో అమ్మిన ఆయుధాలను, ఆయుధ సామగ్రిని బైబ్యాక్ చేసేందుకు ఆసక్తి చూపుతుంది.
రాత్రిపూట యుద్ధం చేయాలంటే తప్పదు మరి..
అధునాతన యుద్ధ ట్యాంకులు, అత్యాధునిక క్షిపణులను తయారు చేయడంలో రష్యాకు మంచి పేరుంది. అందుకే భారత్ సహా అనేక దేశాలు రష్యా నుంచి మిలిటరీ ఎక్విప్‌మెంట్స్ కొనుగోలు చేస్తూ ఉంటాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. రష్యా మిలిటరీ విభాగంపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. అందుబాటులో ఉన్న ఆయుధాలను, క్షిపణులను రష్యా ఇప్పటికే ఉక్రెయిన్‌పై మోహరించింది. దీంతో గతంలో వాడకుండా పక్కన పెట్టిన పాత ఆయుధాలను కూడా తిరిగి ఉపయోగంలోకి తెచ్చేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. వాటిని రిపేర్ చేసి మళ్లీ యుద్ధ అవసరాలకు వాడాలంటే.. కీలకమైన యుద్ధ సామగ్రి అవసరమవుతాయి. ఇలాంటి సామగ్రినే భారత్ నుంచి రష్యా తీసుకోవాలనుకుంటోంది. రాత్రిపూట యుద్ధం చేయడానికి కావాల్సిన నైట్ విజన్ సామగ్రి అవసరం ఇప్పుడు రష్యాకు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఇవి రష్యా దగ్గర అందుబాటులో లేకపోవడంతో గతంలో భారత్‌కు అమ్మిన వాటినే తిరిగి కొనుగోలు చేయాలని చూస్తోంది. 2013లో మాస్కో నుంచి ఆరు రకాల నైట్ విజన్ పరికరాలను భారత్ కొనుగోలు చేసింది. వీటిని ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఇటీవలే రష్యా మెషిన్ బిల్డింగ్ డిజైన్ బ్యూరో తిరిగి కొనుగోలు చేసింది.
భారత్ నుంచి ఎలాంటి ఆయుధాలు కోరుకుంటోంది ?
నైట్ విజన్ పరికరాల నుంచి పిస్టల్స్, రివాల్వర్స్, సబ్ మెషిన్ గన్స్, షార్ట్ గన్స్, బోల్ట్ యాక్షన్ రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిల్స్, యాంటీ ఎయిర్‌కాఫ్ట్ గన్స్, టాంక్ డిస్ట్రాయర్స్.. ఇలా రష్యా తన వద్ద ఉన్న అన్ని రకాల ఆయుధాలను ఉక్రెయిన్ యుద్ధం కోసం వాడేస్తోంది. యుద్ధంలో పాడైపోయినవి.. రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నవి వందల్లో పేరుకుపోయాయి. సరైన విడిభాగాలు, సామగ్రి ఉంటే.. వీటిని మళ్లీ యుద్ధ అవసరాల కోసం వాడుకోవచ్చు. అందుకే గతంలో తాము భారత్‌కు అందించిన మిలిటరీ ఎక్వి‌ప్‌మెంట్ పార్ట్స్‌ను తిరిగి కొనుగోలు చేస్తోంది రష్యా. పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా.. రష్యా ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుకే కొత్తగా మిలిటరీ సామగ్రిని ఉత్పత్తి చేయడం కంటే.. మిత్ర దేశాల నుంచి తిరిగి తీసుకోవడంపైనే ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే రష్యా నుంచి భారత్‌కు ఆర్డర్లు వస్తున్నాయి.
రష్యాతో పనేంటి.. మనమే తయారు చేద్దాం!
ప్రపంచంలోనే ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న భారత్.. కొంతకాలంగా విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ అవసరాలకు కావాల్సిన మిలrటరీ సామగ్రిని సొంతంగా తయారు చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎలాంటి ఆయుధాలు కావాల్సి వచ్చినా మొదటి నుంచి మిత్రదేశంగా ఉన్న రష్యాపైనే భారత్ ఆధారపడేది. దాదాపు 60 శాతం రక్షణ దిగుమతులు మనదేశానికి రష్యా నుంచే అందేవి. అయితే క్రమంగా రష్యా నుంచి కూడా దిగుమతులను తగ్గించింది భారత్. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు, ఇతర దేశాల నుంచి పోటీ పెరగడం, దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీకి పెద్దపీట వేయడం వంటి కారణాల వల్ల రష్యా నుంచి దిగుమతులు తగ్గిపోయాయి.
కొనడం కాదు.. మనమే ఇతరులకు అమ్ముతున్నాం
యుద్ధంలో ఇరుక్కుపోయి.. ఉక్రెయిన్‌పై పోరాడేందుకు ఆయుధ సామగ్రి కోసం భారత్ లాంటి దేశాల వైపు రష్యా చూస్తుంటే.. మన దేశం మాత్రం సొంతంగా ఆయుధ ఉత్పత్తులపై దృష్టి పెట్టింది. రష్యాపై ఆధారపడటం మానేసే పరిస్థితికి క్రమంగా చేరుకుటోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఇండియా డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి. సొంత సాంకేతిక పరిజ్ఞానంతో మిలిటరీ సామగ్రిని తయారు చేస్తున్న భారత్.. 75 దేశాలకు ఎగుమతి చేస్తోంది. వీటి విలువ 1.9 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. భారత్ నుంచి రష్యా కొనుగోలు చేయడం కూడా మన దేశ మిలిటరీ సత్తాను కచ్చితంగా పెంచుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.