చలికాలంలో మన ఇమ్యూనిటీ మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి.
ఇందుకు ఉసిరి తీసుకోవడం బెటర్.
ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
దీనిలో ఉండే ఫైబర్ మలబద్దకం నుంచి దూరం చేస్తుంది.
చుండ్రుని దూరం చేసి జుట్టును కాపాడుతుంది.
ఉసిరిలో పోషకాలు, ఔషధ గుణాలు.. విటమిన్ సీ, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ–కాంప్లెక్స్‌తోపాటు ఇతర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
ఉసిరి తీసుకుంటే.. గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది.
జీర్ణ సమస్యలు లేకుండా బాగా జీర్ణం అవ్వడానికి కూడా ఉసిరి మనకు మేలు చేస్తుంది.
2015 లో చేసిన స్టడీ ప్రకారం.. ఉసిరి తరచుగా తీసుకుంటే.. త్వరగా బరువు తగ్గుతారు.
ఉసిరి తిందాం.. ఆరోగ్యంగా ఉందాం..