2026 నాటికి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు.. ఎయిర్ ట్యాక్సీలకు డీల్ చేసుకున్న ఆర్చర్ ఏవియేషన్, ఇంటర్ గ్లోబ్

దేశ వ్యాప్తంగా 2026 నాటికల్లా పూర్తి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సర్వీసులు ప్రారంభం.

ఇందుకోసం ఆర్చర్ ఏవియేషన్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

ఎయిర్ ట్యాక్సీలతో ఢిల్లీలోని కనాట్ ప్లేస్ నుంచి హర్యానాలోని గురు గ్రామ్ కి 7 నిమిషాల్లో చేరుకోవచ్చు.

రోడ్డు మార్గంలో 27 కి.మీ దూరం ఉండే ఈ ప్రయాణానికి సాధారణంగా 60-90 నిమిషాలు పడుతుంది.

పట్టణ ప్రాంతాల్లో ఎయిర్ ట్యాక్సీలతో పాటు కార్గో, లాజిస్టిక్స్, ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఎలక్ట్రిక్ విమానాలను వినియోగించే ఇరు సంస్థలు పరిశీలించనున్నట్లు ఇంటర్ గ్లోబ్ తెలిపింది.

ఇండిగో పేరిట ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ విమానయాన సర్వీసులు అందిస్తోంది.

ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (ఈవీ టీవీ ఎల్) విభాగంలో ఆర్చర్ ఏవియేషన్ కార్యకలాపాలు సాగిస్తోంది.

2026 లో ఎయిర్ ట్యాక్సీలు నడపనున్నట్లు ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది.