ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీసు బిల్డింగ్‌గా అవతరించింది.
ఈ భవనం నిర్మాణానికి రూ.3,000 కోట్లు ఖర్చయ్యాయి.
దీనిని మణిత్ రస్తోగి అనే ఆర్కిటెక్ట్ రూపొందించారు.
ఈ భవనం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
మధ్యలో విశాలమైన కారిడార్‌తో లింక్ అయిన తొమ్మిది భవనాలతో ఈ ఆఫీసు నిర్మితమైంది.
ఒక్కో భవనంలో 15 అంతస్తులతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది.
భవనం లోపల డైమండ్స్ తయారు చేసే.. 4,500 ఆఫీసులు ఉన్నాయి.
వజ్రాల కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారులు ఈ అద్భుతమైన ఆఫీసులకు వచ్చి పని చేసుకోవచ్చు.
ఈ ఆఫీసులు 300 చదరపు అడుగుల నుంచి 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.
20 లక్షల చదరపు అడుగుల స్థలంతో అండర్‌గ్రౌండ్‌లో పార్కింగ్ ప్లేస్
ప్రపంచంలో పర్యావరణానికి హాని చెయ్యని విధంగా అతి పెద్ద ఇంటర్ కనెక్టర్ భవనం ఇది
భవనం లోపల సెక్యూరిటీ వాల్ట్‌లు, మీటింగ్ హాల్స్, రెస్టారెంట్లు, బ్యాంకులు వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
మొత్తం 65 వేల మంది డైమండ్ నిపుణులకు వేదికగా సూరత్ డైమండ్ బోర్స్ ఉంది.