మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు అతిగా తీసుకుంటున్నారా..?

ఇటీవలి కాలంలో మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వాడటం ఎక్కువైంది

ఈ ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని భావిస్తారు

వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావొచ్చు

ఈ ట్యాబ్లెటను అతిగా తీసుకుంటే జీర్ణ సమస్యలు, డయేరియా వస్తాయి

విటమిన్ సి, డి ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి

కొన్ని ట్యాబ్లెట్లు ఇతర మందుల పనితనాన్ని తగ్గిస్తాయి

హైపర్‌విటమినాసిస్ అనే సమస్య రావొచ్చు

విటమిన్ ఇ ఎక్కువైతే రక్త సంబంధిత సమస్యలొస్తాయి

అందువల్ల పరిమితంగా మాత్రమే ఈ ట్యాబ్లెట్లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు