ప్రపంచంలో అద్భుతమైన చేపలే కాకుండా.. అసహ్యమైన చేప కూడా ఒకటి ఉంది.
ఈ చేప పేరు 2003 లో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యింది.
ఈ చేపను తొలి సారి 1983లో న్యూజిలాండ్ తీరంలో ఓ పరిశోధన నౌక దీన్ని కనుగొంది.
ఇవి సముద్రంలో సుమారు 600 నుంచి 1200 మీటర్ల అడుగుల లోతుల్లో సంచరిస్తుంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
సముద్రం పీడనం అధికంగా ఉండే అడుగున ఇవి ఉండటం కారణంగా వీటి ఎముకలు, కండరాలతో కూడిన మెత్తని శరీరంతో చూసేందుకు వికారంగా ఉంటాయన్నారు.
శాస్త్రవేత్తలు దీన్ని బ్లాబ్ ఫిష్ అని పిలుస్తారు.
ఈ చేప చూడడానికి అచ్చం జెల్లీ ఫిష్ మాదిరి ఉంటుంది.
ఈ చేప ఆకారం పలు ఎమోజీల్లో కూడా ఉంటుంది
ఇది సైక్రోల్యూట్స్ మైక్రోపోరోస్ కుటుంబానికి చెందినది.
దీని శాస్త్రీయ నామం కూడా అలానే(సైక్రోల్యూట్స్ మైక్రోపోరోస్) వ్యవహరించారు పరిశోధకులు.